తనకు నచ్చిన కథ కాదంట..?

Update: 2018-10-15 06:45 GMT

ఈ మధ్య దిల్ రాజు అంచనాలన్నీ తప్పవుతున్నాయి. పని గట్టుకుని చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో.. దిల్ రాజు సరైన కథలను ఎంపిక చేసుకోలేక పోతున్నాడంటూ ఫిలింనగర్ లో టాక్ వినబడుతుంది. వరుస బెట్టి దిల్ రాజు సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో దిల్ రాజు ప్రెస్టేషన్ లో ఉన్నాడనే టాక్ కూడా నడుస్తుంది. తాజాగా దిల్ రాజు బ్యానర్ నుండి రామ్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో హలో గురు ప్రేమ కోసమే సినిమాతో ఈ దసరా పండగ నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రకాశ్ రాజ్ చెప్పడంతో...

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న దిల్ రాజు ఈ సినిమా ముచ్చట్లను కథలు కథలుగా చెబుతున్నాడు. అయితే ఈ సినిమా కథ ఎంపికలో తన హ్యాండ్ పెద్దగా లేదన్నట్టుగానే చెబుతున్నాడు. తన వద్దకు రైటర్ ప్రసన్న కుమార్ రెండు కథలతో వచ్చాడని.. అయితే తనకి ఒక కథ నచ్చిందని... కానీ రైటర్ ప్రసన్న కుమార్ మరో కథ అయిన హలో గురు ప్రేమకోసమే కథను నటుడు ప్రకాష్ రాజ్ కి వినిపించగా కథ బాగా నచ్చిన ప్రకాష్ రాజ్ తనకి ఫోన్ చేసి హలో గురు ప్రేమ కోసమే కథే బాగుంది దీన్నే సినిమా చేస్తే బాగుంటుంది కదా ఇంకోసారి కథ విను అని చెప్పారని.. అప్పుడు మళ్లీ కథ విని దీనికే ఓటేశానని దిల్ రాజు చెబుతున్నాడు.

మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేనా..?

ఇక హలో గురు ప్రేమ కోసమే సినిమా అంతా కామెడీ ఎంటెర్టైనెర్ గా ఉంటుందని... కామెడీకి కొదవుండదని చెబుతున్నాడు. అలాగే రామ్ ఈ సినిమాలో ప్రాణం పెట్టి చేసాడంటున్నాడు దిల్ రాజు. మరి హలో గురు ప్రేమ కోసమే సినిమాతో అయినా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాననే ఆశతో దిల్ రాజు ఉన్నాడు. ఈ దసరా అంటే రేపటి గురువారం అక్టోబర్ 18న ఈ సినిమా విడుదలవుతుంది.

Similar News