రవితేజ గురించి.. దిల్ రాజు ఇలా చెప్పాడేంటి..!

దిల్ రాజు బ్యానర్ లో రవితేజ రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టాడు. అయితే ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 సినిమా కూడా ఉండబోతుంది [more]

Update: 2019-02-01 07:27 GMT

దిల్ రాజు బ్యానర్ లో రవితేజ రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టాడు. అయితే ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 సినిమా కూడా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్నప్పటి నుండి ఇందులో రవితేజ కూడా ఉంటాడనే ప్రచారం జరుగుతోంది. ఎఫ్ 2 లో వెంకటేష్, వరుణ్ తేజ్ లు కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో నిర్మాత దిల్ రాజు ఎఫ్ 2కి సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు. ఇక ఎఫ్ 2కి సీక్వెల్ గా ఎఫ్ 3 ఉంటుందని దిల్ రాజు ప్రకటించగానే ఎఫ్ 3లో వెంకీ, వరుణ్ లతో పాటుగా రవితేజ కూడా ఉంటాడనే న్యూస్ బయలు దేరింది. వెంకటేష్ కామెడీ టైంయింగ్ కి రవితేజ కామెడీ కూడా తోడైతే సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయమన్నారు.

సస్పెన్స్ పెంచిన దిల్ రాజు

ఇక ఎలాగూ అనిల్ రావిపూడి.. రవితేజతో ఇప్పటికే సినిమా చేసి ఉండే సరికి వరుణ్, వెంకీ, రవితేజతో ఎఫ్ 3 ఫిక్స్ అని అనుకున్నారు. తాజాగా దిల్ రాజు.. ఎఫ్ 3లో రవితేజ క్యారెక్టర్ గురించి మట్లాడుతూ…. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 కచ్చితంగా ఉంటుందని… 2021 లో ఆ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని.. ఆ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా మరో హీరో ఉంటాడని.. అయితే అది రవితేజనా.. మరొకరా అనేది ఇప్పుడే చెప్పలేనని ప్రకటించాడు. స్క్రిప్ట్ ఫైనల్ అయిన తరువాత ఒక నిర్ణయానికి వస్తామని చెప్పేసరికి ఇప్పుడు రవితేజ ఎఫ్ 3లో ఉంటాడో లేదో అనే అనుమానం ప్రేక్షకుల్లో బలపడుతుంది.

Tags:    

Similar News