దిల్ రాజు ని అందుకే తెలివైనవాడంటారు

మహేష్ బాబు తో సోలో సినిమా కోసం దిల్ రాజు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాడు. కానీ మహేష్, దిల్ రాజు కి అవకాశం ఇవ్వడం లేదు. అందుకే [more]

Update: 2019-12-05 07:34 GMT

మహేష్ బాబు తో సోలో సినిమా కోసం దిల్ రాజు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాడు. కానీ మహేష్, దిల్ రాజు కి అవకాశం ఇవ్వడం లేదు. అందుకే మహర్షి సినిమాని మరో ఇద్దరి తో కలిసి పంచుకోవాల్సి వచ్చింది. కానీ దిల్ రాజు మహర్షి సినిమా విషయంలో తృప్తి పడకపోయేసరికి మహేష్ మీకు మరో సినిమా చేస్తా అని మాటిచ్చేసాడు. మళ్ళీ మహేష్ బాబు – అనిల్ రావిపూడి తో చేసిన సరిలేరు నీకెవ్వరూ సినిమాకి మరో నిర్మాతతో కలిసి షేర్ చేసుకోమంటే దిల్ రాజు వద్దనకుండా.. కేవలం సమర్పకుడిగా, నైజం లో సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తా కానీ.. నిర్మాతగా షేర్ వద్దన్నాడు. ఒకవేళ నిర్మాతగా మల్లి షేర్ చేసుకుంటే మహేష్ తో సోలో సినిమా మిస్ అవుతా అనుకున్నాడు దిల్ రాజు.

అలాగే షేరింగ్ అంటూ పోతుంటే చివరికి మిగిలేదేం కనిపించడం లేదు. అందుకే దిల్ రాజు తెలివిగా అనిల్ రావిపూడి సినిమా నుండి తప్పుకున్నాడు. మరో పక్క ఎఫ్ 2 తర్వాత అనిల్ కూడా దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు. అలా మహేష్ బాబు – అనిల్ రావిపూడి సినిమా చేస్తే.. ఇద్దరి మాట తీరిపోతుంది. కానీ తర్వాత తనకి మిగిలేది పేరు కానీ… డబ్బు కాదు. అందుకే సైలెంట్ గా తెలివిగా తప్పుకున్నాడు దిల్ రాజు. మరి టాలీవుడ్ లో దిల్ రాజు తెలివితేటలూ వేరు. చాల పక్కా కమర్షియల్ గా ఆలోచిస్తాడు.

Tags:    

Similar News