క్లైమాక్స్ పై సంతృప్తి చెందని దిల్ రాజు

నిర్మాత దిల్ రాజు డ్రీం ప్రాజెక్ట్ తమిళ 96 రీమేక్ సినిమా సెట్స్ మీదకెళ్లడానికి బాగా టైం పట్టేలాగే ఉంది. గత ఏడాది కోలీవుడ్ లో లోబడ్జెట్ [more]

Update: 2019-04-01 08:55 GMT

నిర్మాత దిల్ రాజు డ్రీం ప్రాజెక్ట్ తమిళ 96 రీమేక్ సినిమా సెట్స్ మీదకెళ్లడానికి బాగా టైం పట్టేలాగే ఉంది. గత ఏడాది కోలీవుడ్ లో లోబడ్జెట్ తో చాలా సింపుల్ గా తెరకెక్కిన 96 సినిమా అనేక అంచలనాలకు నెలవుగా మారడం.. ఆ సినిమా కథకు బాగా కనెక్ట్ అయిన దిల్ రాజు ఆ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకుని తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు గత ఏడాది డిసెంబర్ లోనే మొదలెట్టినా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఆఖరుకి నటీనటుల ఎంపిక కూడా జరిగిపోయింది. కానీ సినిమాని మొదలు పెట్టడానికి దిల్ రాజు బాగా ఆలస్యం చేస్తున్నాడు. ఈ లోపు రకరకాల వార్తలు 96 మీద బయటికొస్తున్నాయి.

క్లైమాక్స్ తేలకపోవడంతో…

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష స్కూల్ నుండి స్నేహం చేసి లవ్ చేసుకుని, మధ్యలో విడిపోయి.. పదేళ్ల తర్వాత గెట్ టు గెదర్ లో మళ్లీ కలుసుకుంటారు. ఒకరోజు ఇద్దరూ కలిసి ఉండి చివరికి ఎవరిదారిన వారు వెళ్లిపోతారు. విడిపోయిన త్రిష సింగపూర్ వెళ్లిపోతుంది. విజయ్ సేతుపతి మళ్లీ దీనంగా రొటీన్ గా ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికొచ్చి తన లవర్ తో గడిపిన మధురస్మృతులు జాగ్రత్తగా పదిలపరుచుకుంటాడు. అయితే ఆ క్లైమాక్స్ కి తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కారేమో అని దిల్ రాజుతో పాటు 96 తెలుగు టీం కూడా భావిస్తుందట. అయితే 96 తెలుగు రీమేక్ క్లైమాక్స్ మార్చేందుకు దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నా అది ఓ కొలిక్కి రావడం లేదట. అందుకే 96 పట్టాలెక్కేందుకు బాగా ఆలస్యం అవుతుందట.

Tags:    

Similar News