ఒక్క సినిమా కోసం అన్నీ పక్కనపెట్టేసాడా..?

గత ఏడాది కుర్ర హీరోలతో చేసిన సినిమాలన్నీ బోల్తా పడడంతో ఈ ఏడాది వెంకటేష్ – వరుణ్ తేజ్ లతో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న [more]

Update: 2019-01-21 09:55 GMT

గత ఏడాది కుర్ర హీరోలతో చేసిన సినిమాలన్నీ బోల్తా పడడంతో ఈ ఏడాది వెంకటేష్ – వరుణ్ తేజ్ లతో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దిల్ రాజు మళ్లీ ఎడాపెడా సినిమాలు నిర్మించే ఆలోచనకు స్వస్తి చెప్పినట్టుగా తెలుస్తుంది. కుర్ర హీరోలకు లైఫ్ ఇచ్చే పథకాన్ని ఆయన నిలిపివేయాలనుకుంటున్నారట. ఒక హిట్ కొట్టిన డైరెక్టర్స్ ని లాక్ చేసే అలవాటున్న దిల్ రాజు.. ఇప్పుడు కాస్త ఆలోచనతో వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతుంది. దిల్ రాజు గత ఏడాది చివరిలో తమిళ సినిమా 96 మీద కన్నేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలని ఆ సినిమా తమిళనాట విడుదల కాకముందే డిసైడ్ అయ్యాడు. ఆ సినిమా తమిళంలో హిట్ కావడం.. తెలుగులో హీరో హీరోయిన్ దొరకక మొదలవ్వడానికి బాగా టైం పట్టింది.

శేఖర్ కమ్ముల చిత్రానికి బ్రేక్

ఆ సినిమా రీమేక్ విషయంలో బాగా పట్టుదలగా ఉన్న దిల్ రాజు ఎట్టకేలకు శర్వానంద్, సమంతలను ఒప్పించి ఆ సినిమాని ఓ కొలిక్కి తెచ్చాడు. ఈ సినిమాని నిర్మించి హిట్ కొట్టాలని డిసైడ్ అవడంతో దిల్ రాజు తన అప్ కమింగ్ ప్రాజెక్టులను మూడింటిని పక్కన పెట్టేశాడనే టాక్ నడుస్తుంది. ఆ మూడు సినిమాలేవంటే.. శేఖర్ కమ్ములతో ఫిదా హిట్ కొట్టిన దిల్ రాజు… శేఖర్ తదుపరి ప్రాజెక్ట్ కూడా తన బ్యానర్ లోనే చెయ్యాలని ఒప్పించాడు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా దిల్ రాజు – శేఖర్ కమ్ముల ఆ సినిమాని పక్కనపెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్.

ఒక్క సినిమా కోసమే…

ఇక రెండోది ఇంద్రగంటి మోహనకృష్ణ మల్టీస్టారర్ మూవీని కూడా దిల్ రాజు ప్రస్తుతం ఆపేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఎప్పటి నుండి హరీష్ తో సినిమా చెయ్యడానికి దిల్ రాజు దాగుడుమూతలు ఆడుతున్నాడు. మారి ఆ సినిమాని దిల్ రాజు ఎప్పుడో వదిలేసినట్టుగా.. హరీష్ శంకర్ మరో మూవీ రీమేక్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే దిల్ రాజు ఈ సినిమాలన్నీ కేవలం 96 కోసమే పక్కనపెట్టినట్లుగా సోషల్ మీడియా టాక్.

Tags:    

Similar News