దిల్ రాజు బ్యానర్ నుండి మరో చిన్న సినిమా..!

నిర్మాతగా దిల్ రాజుకు మంచి సక్సెస్ ఉంది. అందుకే వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఒకవేళ రెండు మూడు డిజాస్టర్స్ వచ్చినా వెంటనే ట్రాక్ లోకి వచ్చేస్తాడు రాజు. [more]

Update: 2019-01-29 06:59 GMT

నిర్మాతగా దిల్ రాజుకు మంచి సక్సెస్ ఉంది. అందుకే వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఒకవేళ రెండు మూడు డిజాస్టర్స్ వచ్చినా వెంటనే ట్రాక్ లోకి వచ్చేస్తాడు రాజు. రీసెంట్ గా ఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న దిల్ రాజు కొన్ని మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు నిర్మించే పనిలో ఉన్నారు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు తేడా వచ్చినా పెద్దగా లాస్ ఉండదు కాబట్టి ఇటువంటి సినిమాలు తీయనున్నారు. అందుకుగాను హీరో రాజ్ తరుణ్ తో ఓ ప్రాజెక్టు ఫైనల్ చేసారు.

గతంలో వర్కివుట్ కాకున్నా…

గతంలో వీరి కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చినా అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయినా మరోసారి వీరి కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. సుధీర్ బాబుతో ఆడు మగాడ్రా బుజ్జీ అనే సినిమా చేసిన కృష్ణారెడ్డి అనే డైరక్టర్ కు దిల్ రాజు ఛాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అలానే 96 రీమేక్ ని కూడా తెరకెక్కించనున్నాడు రాజు. ఇలా చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Tags:    

Similar News