గోవా బీచ్ లో యంగ్ హీరోస్?

Update: 2018-12-17 05:20 GMT

ఏ భాషా నటులైన చిన్న టైం దొరికితే చాలు గోవానో, బ్యాంకాకో వెళ్లి రిలాక్స్ అవుతారు. బ్యాంకాక్ సినిమా వాళ్ళకి ఎంత ఫేమసో గోవా కూడా అంతే ఫ్యామస్. అక్కడ బీచ్ ఒడ్డున ఆడుతూ పాడుతూ టైం తెలీకుండా ఎంజాయ్ చేస్తుంటారు. సినిమా వాళ్ళే కాదు ఇప్పుడు యూత్ కూడా చాలామంది గోవా వెళ్లి మసాజ్ లు, బీచ్ ఒడ్డున కేరింతలు కొడుతూ సేద తీరుతున్నారు. మొన్నీమధ్యనే సింగర్స్ బ్యాచ్ చాలామంది ఫ్యామిలీస్ తో సహా గోవా వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ లో యంగ్ హీరోస్ గోవా పయనమవుతున్నారట. అక్కడ జరగబోయే ఒక పార్టీ కోసం ఈ యంగ్ హీరోస్ మొత్తం గోవా కి పోతున్నారట.

అక్కడ గోవా లో జరగబోయే పార్టీకి నాని, మెగా హీరో వ‌రుణ్ తేజ్, హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్, హీరో శ‌ర్వానంద్ లతో పాటుగా డైరెక్టర్స్ వంశీ పైడిప‌ల్లి, వేణు శ్రీ‌రామ్, హ‌రీష్ శంక‌ర్ కూడా హాజరవుతున్నారనేది లేటెస్ట్ న్యూస్. అయితే ఎవరి సినిమా షూటింగ్స్ లో వారు బిజీగా వున్నారు కానీ....ఒక పెళ్లి పార్టీ కోసం ఈ యంగ్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ మొత్తం గోవా కి చెక్కేస్తున్నారట. మరి గోవా లో పెళ్లి చేసుకోబోయేది ఏ హీరోనో అనుకునేరు. కాదు దిల్ రాజు అన్న కొడుకు పెళ్లిని దిల్ రాజు గోవా లో ప్లాన్ చేసాడట. ఈ నెల 21 న జరగబోయే హర్షిత్ వివాహానికి ఈ హీరోలు డైరెక్టర్స్ గోవా వెళ్ళుతున్నారట.

మరి అక్కడ గోవా లో గతంలో నాగ చైతన్య - సమంత పెళ్లి వేడుకలు ఏ రేంజ్ లో జరిగాయో తెలిసిన సంగతే. ఇక తాజాగా దిల్ రాజు కూడా ఒక రేంజ్ లో తన అన్న కొడుకు పెళ్లి ని గోవా లో ప్లాన్ చేసాడట. మరి ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరోస్ మొత్తం పెళ్లి, బ్యాచిలర్ పార్టీలో బీచ్ ఒడ్డున అదరగొట్టేస్తారన్నమాట.

Similar News