దిల్ రాజు కల నెరవేరనుంది..!

టాలీవుడ్ లో దిల్ రాజు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా సక్సెస్ అయ్యారు. నిర్మాతగా ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ [more]

Update: 2019-04-29 07:56 GMT

టాలీవుడ్ లో దిల్ రాజు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా సక్సెస్ అయ్యారు. నిర్మాతగా ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ లో కూడా సినిమాలు నిర్మించే స్థాయికి వెళ్లారు. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోస్ తో చేశారు. కానీ కొంతమంది మిగిలిపోయారు. వాళ్లలో బాలయ్య ఒకరు. ఇప్పుడు బాలయ్య టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? దిల్ రాజు – బాలయ్య కాంబినేషన్ ఓ సినిమా రాబోతుందని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఎప్పటినుండో దిల్ రాజుకి బాలయ్య లాంటి సీనియర్ హీరోతో సినిమా చేయాలని ఉంది కానీ సరైన స్క్రిప్ట్ దొరక ఆగారు.

బాలయ్యకు కథ దొరకడంతో…

ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని ఆలోచనతో ఉన్నప్పుడు సరిగ్గా అదే సమయంలో ఓ దర్శకుడు తెచ్చిన కథ సరిగ్గా బాలయ్యకు సూటబుల్ గా ఉండడం యాదృచ్ఛికంగా జరిగిందట. అయితే ఈ విషయం ఇంతవరకు బాలయ్య వద్దకు వెళ్లలేదని టాక్. ఈ మ్యాటర్ దిల్ రాజు కాంపౌండ్ లోనే ఆగిపోయిందని త్వరలోనే ఆయన వద్దకు వెళ్తుందని వినికిడి. దిల్ రాజుకి మనసులో ఆలోచన రావాలే కానీ ఆయన దాన్ని వదిలి పెట్టరు. కాబట్టి ఈ కాంబినేషన్ లో సినిమా 2019 కాకుంటే 2020లోనైనా మనం చూస్తాం.

Tags:    

Similar News