దిల్ రాజుకి ‘నో’ చెబుతున్న యంగ్ హీరో

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తో సినిమాలు చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి? దిల్ రాజు బ్యానర్ లో ఒక్క సినిమా అయినా చేయాలనీ [more]

Update: 2019-07-29 09:19 GMT

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తో సినిమాలు చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి? దిల్ రాజు బ్యానర్ లో ఒక్క సినిమా అయినా చేయాలనీ చాలామంది డైరెక్టర్లు, హీరోలు అనుకుంటారు. రీసెంట్ గా మహేష్ బాబు తన ప్రమోషన్ స్కిల్స్ నచ్చి సరిలేరు నీకెవ్వరు సినిమాలో దిల్ రాజును యాడ్ చేశారు.

విజయ్ దేవరకొండ మాత్రం….

కానీ ఓ యంగ్ హీరో మాత్రం దిల్ రాజు సినిమా అంటే దూరంగా ఉంటున్నాడట. ఆయన ఎవరో కాదు విజయ్ దేవరకొండ. ఎస్ విజయ్ తో దిల్ రాజు ఓ సినిమా చేయాలనీ చాలా ట్రై చేస్తున్నాడు. గత కొన్ని వారాల నుండి ట్రై చేస్తున్నప్పటికీ విజయ్ మాత్రం ఎస్ అనీ చెప్పకుండా, నో అనీ చెప్పకుండా వున్నట్లు తెలుస్తోంది.

ఎందుకు కాదంటున్నట్లు….?

అలానే ఓ డైరెక్టర్ కూడా దిల్ రాజు కాంబినేషన్ లో విజయ్ తో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. అయితే దిల్ రాజు తో కాకుండా బయట నిర్మాతలతో చేస్తే విజయ్ డేట్స్ దొరుకుతాయి అని ఆ డైరక్టర్ కు సలహాలు అందుతున్నట్లు తెలుస్తోంది. మరి అసలు విజయ్ ఎందుకు దిల్ రాజు తో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదో అర్ధం కావడంలేదు.

Tags:    

Similar News