దిల్ రాజు హోప్స్ మొత్తం ఆ సినిమాపైనే!

Update: 2018-08-29 08:16 GMT

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒక్కరు . ఆయన నిర్మించిన అన్ని సినిమాలు దాదాపు హిట్సే. ఎందుకంటె అతని స్టోరీ సెలక్షన్ కానీ..ఆర్టిస్ట్స్ సెలెక్షన్స్ కానీ..డైరెక్టర్స్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే అతనికి సక్సెస్స్ ఎక్కువ. కానీ గత ఏడాదితో పోల్చుకుంటే ఆయనకు ఈ ఏడాది పెద్దగా కలిసిరాలేదని చెప్పాలి.

రెండు ప్లాప్ లు కావడంతో.....

ఆయన నిర్మించిన “లవర్” “శ్రీనివాస కళ్యాణం” సినిమాలతో ఫ్లాప్స్ ని చవి చూసాడు. అందుకే ఇప్పుడు అతనికి ఎట్టి పరిస్థితిల్లో హిట్ అవసరం అనుకుని తన ఫోకస్ మొత్తం రామ్ హీరోగా నటించిన “హలో గురు ప్రేమకోసమే” సినిమాపైనే పెట్టాడంట. ఆ సినిమాపైనే భారీ అంచనాలు పెట్టుకున్నాడట దిల్ రాజు.

ఈ సినిమా పైనే......

రామ్ కి జోడిగా అనుపమ నటిస్తుంది. ఇది ఇలా ఉంటె ఈ సినిమా డైరెక్టర్ త్రినాద్ రావు నక్కిన తో కూర్చొని ఈ సినిమా కి సంభందించిన కొంత భాగం చూసాడట దిల్ రాజు. సినిమాలో కొన్ని సీన్స్ నచ్చకపోడంతో ఆ సీన్స్ ను మళ్ళి రీషూట్ చేయమన్నాడట దిల్ రాజు. ప్రస్తుతం ఆ సీన్స్ ను రీషూట్ చేసే పనిలో ఉన్నారు టీం. దసరాకు ఈసినిమాను ఎట్టి పరిస్థితిల్లో రిలీజ్ చేయాలనీ దిల్ రాజు భావిస్తున్నారట.

Similar News