అల్లు అర్జున్ వదిలేసినా.. దిల్ రాజు వదలడట!!

అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో జోరులో వరసగా సినిమాలు ప్రకటిస్తున్నాడు. పుష్ప, ఐకాన్, కొరటాల మూవీ ని అల్లు అర్జున్ లైన్ లో పెట్టాడు. సుకుమర్ తో [more]

Update: 2020-08-09 08:04 GMT

అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో జోరులో వరసగా సినిమాలు ప్రకటిస్తున్నాడు. పుష్ప, ఐకాన్, కొరటాల మూవీ ని అల్లు అర్జున్ లైన్ లో పెట్టాడు. సుకుమర్ తో పుష్ప పాన్ ఇండియా మూవీ చేస్తున్న అల్లు అర్జున్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చేయబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రకటించాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కి ఐకాన్ సినిమా చెయ్యాలని లేనట్లుగా కనబడుతుంది వ్యవహారం. ఐకాన్ పాన్ ఇండియా స్క్రిప్ట్ కాదనుకున్నదో… మరేందుకో తెలియదు కానీ.. అల్లు అర్జున్ కొరటాలతో మరో మూవీకి ఓకె చెప్పి ఐకాన్ ని హోల్డ్ లో పెట్టేసాడు. ఐకాన్ తో అల్లు అర్జున్ ని తన బ్యానర్ లో నటింపచేయాలనుకున్న దిల్ రాజుకి అల్లు అర్జున్ అడుగడుగునా అడ్డం అపడుతూనే ఉన్నాడు..

కానీ దిల్ రాజుకి మాత్రం వేణు శ్రీరామ్ చెప్పిన ఐకాన్ స్క్రిప్ట్ మీద బాగా గురి ఉంది. అందుకే అల్లు అర్జున్ కరుణిస్తాడేమో అని ఎదురు చూసి చూసి తాజాగా రామ్ చరణ్ ని ఒప్పించే పని పెట్టుకున్నాడట. అల్లు అర్జున్ హోల్డ్ లో పెట్టిన స్క్రిప్ట్ తో రామ్ చరణ్ ని ఒప్పించే ప్రయత్నాలు దిల్ రాజు మొదలు పెట్టాడట. RRR తర్వాత ఇప్పటివరకు రామ్ చరణ్ మరో మూవీ ప్రకటించలేదు. దాన్ని అదునుగా చేసుకున్న దిల్ రాజు రామ్ చరణ్ వెంటపడుతున్నాడట. మరి అల్లు అర్జున్ వదిలేసిన స్క్రిప్టు తో రామ్ చరణ్ సినిమా చేస్తాడా లేదా అనేది ప్రస్తుతానికున్న అతిపెద్ద సస్పెన్స్.

Tags:    

Similar News