తెలియక మాట్లాడిందిలే అంటున్న దిల్ రాజు..!

గత ఏడాది తమిళంలో చాలా సింపుల్ స్టోరీతో సింపుల్ గా తెరకెక్కిన 96 సినిమా క్లాసికల్ హిట్ గా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష [more]

Update: 2019-01-31 08:41 GMT

గత ఏడాది తమిళంలో చాలా సింపుల్ స్టోరీతో సింపుల్ గా తెరకెక్కిన 96 సినిమా క్లాసికల్ హిట్ గా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమాలోని ఎమోషన్, ఫీల్, లవ్ అన్నీ తమిళ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అయితే అదే సినిమాని తెలుగులో దిల్ రాజు రీమేక్ చేయబోతున్నాడని… ఆ సినిమాలో శర్వానంద్.. విజయ్ సేతుపతి క్యారెక్టర్ లో, సమంత.. త్రిష క్యారెక్టర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ 96 దర్శకుడే తెలుగులోనూ డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. విడుదలకు ముందే ఆ సినిమాని రీమేక్ చెయ్యాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడు. అయితే 96 సినిమాని తమిళంలో వీక్షించిన హీరోయిన్ సమంత… ఆ సినిమాని ఏ భాషలోనూ రీమేక్ చేయకపోవడమే బెటర్ అని, తమిళంలో తెరకెక్కిన ఆ సినిమా ఏ భాషలో రీమేక్ చేసినా ఆ ఫీల్ మిస్ అవుతుందని అన్నది.

మొదటి రీమేక్ సినిమా ఇది

అయితే తాజాగా ఆ విషయంపైనా దిల్ రాజు కి ఒక ప్రశ్న ఎదురైంది. రీమేక్ చెయ్యపోవడం కరెక్ట్ అన్న సమంత 96లో హీరోయిన్ గా ఎలా చేస్తుంది ? ఎలా ఒప్పించారని అడగగా ? నేను ఈ సినిమా తమిళంలో విడుదలకు ముందే తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాను. నేను నా కెరీర్ లో రీమేక్ చేస్తున్న మొదటి సినిమా 96. అయితే నేను రీమేక్ రైట్స్ తీసుకున్న తర్వాత ఆ సినిమాలో హీరోగా అల్లు అర్జున్, నాని, గోపీచంద్ పేర్లు వినబడ్డాయి. తెలుగులో ఏ హీరో.. ఆలాగే ఏ టీం పనిచేస్తుందో తెలియకపోవడం వల్లనే సమంత అలా మాట్లాడింది. అయినా ఆ సినిమా కథ నాకు చాలా బాగా నచ్చింది. ఆ సినిమా తెలుగులోనూ గొప్ప హిట్ అవుతుందని చెప్పాడు దిల్ రాజు.

Tags:    

Similar News