దిల్ రాజు డేర్ చేస్తాడా?

గత పది రోజుల నుండి కన్నడలో కెజిఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ ఒక సినిమా చెయ్యబోతున్నాడు.. [more]

Update: 2019-01-03 03:53 GMT

గత పది రోజుల నుండి కన్నడలో కెజిఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ ఒక సినిమా చెయ్యబోతున్నాడు.. దీనికి దిల్ రాజు నిర్మతగా వ్యవహరిస్తాడనే న్యూస్ మాములుగా చక్కర్లు కొట్టడం లేదు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చిస్తున్నారు. మరి ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడే దిల్ రాజు ఇలాంటి సాహసం చేస్తాడా? ఎందుకంటే భారీ బడ్జెట్ తో తమిళంలో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 సినిమాని ఎనౌన్స్ చేసి… శంకర్ దర్శకత్వంలో బోలెడంత బడ్జెట్ అవుతుంది మనకెందుకులే అని చల్లగా జారుకున్న దిల్ రాజు ఇప్పుడు ఇంత భారీగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బాహుబలి, సాహో సినిమాల్తో అందనంత ఎత్తుకు ఎదిగిన ప్రభాస్ తో సినిమా చెయ్యడమే ఆబ్బె అదంతా ఒట్టి రూమర్ అయ్యుంటుంది అంటూ ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు మొదలయ్యాయి.

కెజిఎఫ్ చిత్రం కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ కానీ.. తెలుగులో, తమిళంలో యావరేజ్ హిట్ అందుకుంది. అలాగే ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాతో పాటుగా జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. మరి ఈ రెండు చిత్రాల్లో సాహో ఈ ఏడాది, రాధాకృష్ణ చిత్రం వచ్చే ఏడాది మొదట్లో విడుదల కాబోతున్నాయి. ఇక ఈ చిత్రాల తర్వాత ప్రభాస్ మరో చిత్రానికి ఎక్కడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రభాస్ బాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమాకి ప్లాన్ చేసుకుంటున్నాడని న్యూస్ ఉండనే ఉంది. ఇక కెజిఎఫ్ హిట్ తో ప్రభాస్ తో సినిమా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. కానీ దిల్ రాజు ఇప్పటికే ప్రశాంత్ నీల్ తోనూ, ప్రభాస్ తోనూ చర్చలు జరుపుతున్నాడని అంటున్నారు.

ఎలాగూ దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ రెండు చిత్రాల్లో నటించాడు కాబట్టి.. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ అనగానే అందరూ నమ్మేయ్యడానికి రెడీ అయ్యారు. ఇక దిల్ రాజు ప్రస్తుతం మహర్షి సినిమా ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు . కానీ ఎప్పుడూ సేఫ్ గా మీడియం బడ్జెట్ చిత్రాలే తెరకెక్కిస్తుంటాడు . అందులోను గత ఏడాది దిల్ రాజు నిర్మించిన చిత్రాలన్నీ యావరేజ్ లు, ప్లాప్ లు అయ్యాయి. మరి భారతీయుడు 2 ని చెయ్యలేక చేతులెత్తేసిన దిల్ రాజు ఇప్పుడు ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబో ని సెట్ చేసి భారీ బడ్జెట్ పెట్టి డేర్ చేస్తాడంటారా… చూద్దాం ఏం జరగబోతుందో అనేది.

Tags:    

Similar News