కామెడీ వదిలేసాడా?

టాప్ కామెడీ షో అయినా జబర్దస్త్ ని వదిలేసి… అక్కడ ఫైన్ కట్టి మరీ అధిక పారితోషికం కోసం బిగ్ బాస్ కి వచ్చిన ముక్కు అవినాష్ [more]

Update: 2020-12-04 14:39 GMT

టాప్ కామెడీ షో అయినా జబర్దస్త్ ని వదిలేసి… అక్కడ ఫైన్ కట్టి మరీ అధిక పారితోషికం కోసం బిగ్ బాస్ కి వచ్చిన ముక్కు అవినాష్ కామెడీతోనే టైటిల్ విన్నర్ అవుదామనుకుని కలలు కన్నాడు. కామెడీ చేస్తే చాలు.. బిగ్ బాస్ టైటిల్ మనది అనుకున్నాడు. అందుకే నాగార్జున ఎంకరేజ్ చేసినప్పుడల్లా రెచ్చిపోయాడు. అభిజిత్ తో గొడవ, మోనాల్ తో గొడవ.. అరియన తో ఫ్రెండ్ షిప్. నన్ను కామెడీ చేయడానికే ఈ షోకి పిలిచారు అంటూ అవినాష్ కామెడీ మీదే కూర్చున్నాడు. టాస్క్ ల విషయంలో బాగా పోరాడతాడు.. కానీ గెలవడు. ఆరియానాతో ఫ్రెండ్ షిప్ చేస్తాడు. కానీ సింపతీ వర్కౌట్ అయ్యేలా చూసుకుంటాడు. ఇక మొన్న ఆదివారం బిగ్ బాస్ ఎవిక్షన్ కార్డు వాడకపోతే ఎలిమినేట్ అయ్యేవాడే.. ఆ విషయాన్నీ అవినాష్ డైజెస్ట్ చేసుకోవడం లేదు. నేను కామెడీ చేసాడు, పోరాడాను.. వీక్ కంటెస్టెంట్స్ ఉన్న హౌస్ నుండి స్ట్రాంగ్ అయిన నన్నెలా పంపిస్తారు అంటూ అవినాష్ ఇప్పడు కామెడీ చెయ్యడం మానేసి బిగ్ బాస్ హౌస్ లో రాజకీయాలు మొదలు పెట్టాడు .

గత వారం ఎలిమినేషన్స్ నుండి తప్పించుకుని మరో వారం ఉంటున్నా అనే ఆలోచన లేకుండా అవినాష్ బాగా డల్ అయ్యాడు. వీక్ కంటెస్టెంట్స్ ఉన్న వారిని హౌస్ లో ఉంచి నన్ను పంపాలకునుకుంటున్నారు అంటూ ఏడుస్తున్నాడు. ఇక అఖిల్ – సోహైల్ గేమ్ కలిసి ఆడుతున్నారంటూ గొడవ చేసిన అవినాష్ హారిక – అభిజిత్ కి సపోర్ట్ చేస్తూ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. కామెడీ కామెడీ అనే అవినాష్ కాస్త ఇప్పుడు రాజకీయాలు చేస్తూ బిగ్ బాస్ రాజకీయనాయకుడిలా కనబడుతున్నాడు. అఖిల్- సోహైల్ విషయమే కాదు… మోనాల్ తనని తన్నింది అని, ఆమె అబద్దాలు చెబుతుంది అని సోహైల్ దగ్గర, అభిజిత్ హారిక దగ్గర మాట్లాడుతున్నాడు. మరోపక్క మోనాల్ నా దగ్గరకొచ్చి ప్రేక్షకుల్లో నీకు సింపతీ లేదని చెప్పింది అంటున్నాడు. అసలు అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్ అంతా ఆడలేకపోవడమే అవినాష్ ఏడుపుకి మెయిన్ కారణంగా కనబడుతుంది. మరి అవినాష్ ఇప్పుడు బిగ్ బాస్ లో కామెడీ చెయ్యడం ఆపేసి.. సీరియస్ గా ఉంటున్నాడు. ఈ వారం గనక ఎలిమినేట్ అయితే అవినాష్ బాగా ఫీలయ్యేటట్టు ఉన్నాడు. సేవ్ అయితే ఓకె.. లేదంటే.. లేదు.

Tags:    

Similar News