అందరిలాగే.. మాస్ అంటున్నాడుగా?

హీరోలంతా మాస్ మాస్ అంటూ తహతహలాడతారు. కారణం మాస్ అభిమానులను సంపాదించుకుంటే… హీరోయిజానికి ఢోకా ఉండదని. ఇక్కడ టాలీవుడ్ హీరోలంతా మాస్ కథలకే మొగ్గు చూపుతూ కెరీర్ [more]

Update: 2020-05-26 08:06 GMT

హీరోలంతా మాస్ మాస్ అంటూ తహతహలాడతారు. కారణం మాస్ అభిమానులను సంపాదించుకుంటే… హీరోయిజానికి ఢోకా ఉండదని. ఇక్కడ టాలీవుడ్ హీరోలంతా మాస్ కథలకే మొగ్గు చూపుతూ కెరీర్ లో దారుణమైన దెబ్బ తిన్నారు. తాజాగా ఓ యంగ్ తమిళ హీరో కూడా మాస్ కథలకే ఇంట్రెస్ట్ చూపుతున్నాడట. అర్జున్ రెడ్డి రీమేక్ తో తమిళ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ సినిమాతో ధృవ్ హీరోగా హిట్ కొట్టడం.. డెబ్యూ సినిమాతోనే పేరు తెచ్చుకోవడం జరిగింది.

ఆ సినిమా తర్వాత ధృవ్ ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడో అనే క్యూరియాసిటీ తమిళ ప్రేక్షకుల్లో ఉంది. అయితే ధృవ్ రెండు మాస్ కథలను లైన్ లో పెట్టినట్లుగా కోలీవుడ్ మీడియా టాక్. రెండు స్క్రిప్ట్ లను లైన్ లో పెట్టిన ధృవ్ ఆ సినిమాని మురుగదాస్ అసిస్టెంట్ తో చేయనున్నాడట. ఆ సినిమా కోసం ధృవ్ కాస్త మాస్ లుక్ లోకి మారుతున్నాడట. కొత్త లుక్ అండ్ కొత్త హెయిర్ స్టయిల్ మరియు షార్ప్ లుక్ కిశోకోసం బాగా ట్రై చేస్తున్నాడట. మరి ధృవ్ మాస్ అవతారంలో రెండో సినిమా లో కనిపించి.. రఫ్ అండ్ ఎనేర్జిటిక్ మస్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.

Tags:    

Similar News