"మారి 2"లో చాలా విశేషాలే ఉన్నాయి..!

Update: 2018-12-18 11:35 GMT

ధ‌నుష్ హీరోగా, సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టించిన లెటెస్ట్‌ చిత్రం మారి 2. ఈ చిత్రం మారి కి సీక్వెల్ గా వ‌స్తుంది. ఇప్ప‌టికే మారికి ఉన్న క్రేజ్ మారి 2కి మార్కెట్ లో క్రేజ్ ని తీసుకువ‌చ్చింది. మారి 2 టీజ‌ర్స్‌, పోస్ట‌ర్స్ కి, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావ‌టంతో ఫ్యాన్సి రేట్ల‌కే బ‌య్య‌ర్స్ కొనుగొలు చేయ‌టం విశేషం. ఈ చిత్రాన్ని ఆంధ్రా, సీడెడ్ హ‌క్కుల‌ని ప్ర‌ముఖ నిర్మాత‌ ఐకాన్ మూవీస్ అదినేత శ్రీరామ్ విడుద‌ల చేస్తున్నారు. డి.ప్ర‌తాప్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో, ధ‌నుష్ నిర్మాత‌గా బాలాజీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న గ్రాండ్ గా విడుద‌ల అవుతుంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మారి 2లో ఓ సాంగ్ ని ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇల‌య‌రాజా పాడ‌గా, హీరో ధ‌నుష్ లిరిక్స్ అందించారు. అలాగే ఓ సాంగ్ కి ఇండియ‌న్ మైఖెల్ జాక్స‌న్ ప్రభుదేవా కొరియోగ్రఫి చేయ‌టం విశేషం. ఈ సాంగ్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

Similar News