దేవ్, దాస్ ఫుల్ కామెడీ పండిస్తారట..!

Update: 2018-09-24 06:43 GMT

ఈ నెల 27న నాగార్జున - నానిలు మన ముందుకు 'దేవదాస్' అనే సినిమాతో వస్తున్నారు. ట్రైలర్ బట్టి చూస్తుంటే ఇందులో నాగ్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడని అర్థం అవుతుంది. ట్రైలర్ లో నాగ్ గన్స్ తో ఉండటం.. ఫైట్స్ చేయడం చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అయితే నాగ్ ఇందులో మాఫియా డాన్ గా చాలా తక్కువ సేపే కనిపిస్తాడట. సినిమా మొత్తం హిల్లేరియస్ ట్రాక్ మీద నడుస్తుందని తెలుస్తుంది. రీసెంట్ గా 'దేవదాస్' సినిమాను కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించారట. వారు చెబుతున్న ప్రకారం నాగ్ మాఫియా బ్లాక్ అన్నది చాలా చిన్నది అని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ ఎంతో సేపు ఉండదని చెబుతున్నారు. సినిమా మొత్తం నవ్వుల పడవ మీద సాగుతుందని చెబుతున్నారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంతే నవ్వులే అంట. స్క్రిప్ట్ కూడా అదేవిధంగా రాసుకున్నాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య.

కీలక పాత్రలో శరత్ కుమార్...

సినిమా మొత్తంలో ప్రేక్షకులకి ఎక్కడ బోర్ కొట్టదని చివరి వరకు నవ్వుకుంటూనే ఉంటారని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ లో నాని ఫుల్ గా నవ్వులు పూయించేసాడని టాక్. అలాగే తమిళ్ నటుడు శరత్ కుమార్ పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని వినికిడి. నాని - నాగ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు దానికి ఈ పాజిటివ్ తోడైతే సినిమా హిట్టే. చూద్దాం ఏం జరుగుతుందో.

Similar News