దేవదాస్ కు ఊహించని ఎదురు దెబ్బ..!

Update: 2018-10-03 08:01 GMT

ఎన్నో అంచనాల మధ్య గత వారం రిలీజ్ అయిన దేవదాస్ చిత్రం మిక్స్డ్ టాక్ తో అంతంత మాత్రంగా ఆడుతుంది. నాగార్జున - నాని జంటగా నటించిన సినిమా అయినప్పటికీ థియేటర్స్ కి ప్రేక్షకులని రప్పించలేకపోతుంది. దీనికితోడు సినిమాపై విమర్శలు వస్తున్న టైంలో ఈ సినిమా లీక్ అవ్వడంతో యూనిట్ కు మరింత ఇబ్బందికరంగా మారింది. ఏదో ఫోన్ లో తీసినట్టు కాకుండా ఎవరో కావాలనే లీక్ చేసినట్టు హై క్వాలిటీ మూవీ లీక్ అయింది. చాలా పకడ్బందీగా లీక్ చేసినట్టు క్వాలిటీ చుస్తే అర్ధం అవుతుంది. కొందరు చెబుతున్న ప్రకారం ఇది ఎడిటింగ్ సూట్ నుంచి డైరెక్ట్ గా ఇంటర్నెట్ లోకి వచ్చిందని చెబుతున్నారు. లేకపోతే ఇంత క్వాలిటీ రాదని అంటున్నారు.

నోటా వచ్చాక కష్టమే..!

మరి సినిమా మొత్తాన్ని లీక్ చేసే దమ్ము ఎవరికి ఉందో తెలియాల్సి ఉంది. దాంతో ఈ సినిమాకు మరిన్ని కష్టాలు తప్పవని భావిస్తున్నారు. ప్రాఫిట్స్ అటు ఇటుగా ఉన్న టైంలో ఇలా జరగటం నిర్మాతలకు తీరని నష్టమే. సోమవారం నుంచి ఈ సినిమా దారుణంగా పడిపోతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. వచ్చే వారం నోటా రిలీజ్ ఉండటంతో ఇక ఈ సినిమా కలెక్షన్స్ పడిపోనున్నాయి.

Similar News