దేవదాస్ మొదటి రోజు కలెక్షన్స్..!

Update: 2018-09-28 06:48 GMT

గురువారం వరల్డ్ వైడ్ గా నాగార్జున - నాని కాంబోలో తెరకెక్కిన దేవదాస్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి మొదట్లో యావరేజ్ టాకొచ్చినా నాగ్ - నాని నటనకు ఫుల్ మార్కులు పడడంతో.. సినిమాకి హిట్ టాక్ వచ్చింది. దేవాగా నాగ్ పెరఫార్మెన్స్, దాసు గా నాని కామెడీ పెరఫార్మెన్స్ సినిమాకి బలంగా నిలవడమే కాదు.. హీరోయిన్ పాత్రల్లో పట్టు లేకపోయినా.. గ్లామర్ పరంగా రష్మిక, ఆకాంక్ష సింగ్ లు ఆకట్టుకున్నారు. 30 కోట్ల పైనే ప్రీ రిలీస్ బిజినెస్ చేసుకున్న దేవదాస్ సినిమా ఫస్ట్ డే ఏపీ, టీఎస్ షేర్స్ ఎంతొచ్చయో చూద్దాం.

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 1.39

సీడెడ్ 0.73

నెల్లూరు 0.18

కృష్ణా 0.33

గుంటూరు 0.53

వైజాగ్ 0.56

ఈస్ట్ గోదావరి 0.39

వెస్ట్ గోదావరి 0.26

టోటల్ ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 4.37

Similar News