దేవదాస్ కి కష్టాలు మొదలు..!

Update: 2018-10-04 08:50 GMT

నాని - నాగార్జున హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన దేవదాస్ సినిమా మొదటివారం పూర్తి చేసుకుంది. సినిమాకి టాక్ యావరేజ్ రావడంతో కలెక్షన్స్ కూడా యావరేజ్ గానే ఉన్నాయి. అసలు నాని, నాగార్జున క్రేజ్ కూడా దేవదాస్ కలెక్షన్స్ ని కాపాడలేకపోయాయి. తాజాగా దేవదాస్ హెచ్ డీ ప్రింట్ ఒకటి ఇంటర్నెట్ లో హల్చల్ చెయ్యడం... దేవదాస్ వచ్చిన వారానికే బోలెడంత ఫేమ్ ఉన్న విజయ్ దేవరకొండ నోటా సినిమాతో రావడంతో.. ఇక దేవదాస్ సినిమా కలెక్షన్స్ కి గండి పడినట్లే. ఇక దేవదాస్ ఒక వారంలో ప్రపంచవ్యాప్తంగా ఎంత తెచ్చిందో ఓసారి చూసేద్దాం.

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 6.03

సీడెడ్ 2.20

నెల్లూరు 0.54

కృష్ణ 1.20

గుంటూరు 1.38

వైజాగ్ 2.01

ఈస్ట్ గోదావరి 1.06

వెస్ట్ గోదావరి 0.81

ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 15.23

ఇతర ప్రాంతాలు 2.25

ఓవర్సీస్ 3.10

టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ 20.58

Similar News