ఎన్టీఆర్ లో కొన్ని లేపేస్తున్నారా?

Update: 2018-11-01 02:39 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - నాగ చైతన్య ఇద్దరు కలిసి 'గుండ‌మ్మ క‌థ‌' సినిమాను రీమేక్ చేద్దాం అని ఎప్పటినుండో అనుకుంటున్నారు కానీ ఇప్పటివరకు ఫైనల్ అవ్వలేదు. ఎన్టీఆర్ గా జూనియర్ ఎన్టీఆర్...నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య చేద్దాం అనుకున్నారు. అంత బాగానే ఉంది మరి గుండ‌మ్మ‌గా ఎవ‌రు న‌టిస్తారు? అందుకే ఆ రీమేక్ ఆగిపోయింది. ‘గుండ‌మ్మ లేదు కాబ‌ట్టి.. మేం ఆ సినిమా చేయ‌లేక‌పోయాం’ అని ఈ హీరోలిద్ద‌రూ చేతులెత్తేశారు.

ఆ సినిమలో గుండ‌మ్మ‌గా సూర్యకాంతం పాత్ర అంతలా జనాల్లో ఇంపాక్ట్ చూపించింది. ఆ పాత్ర రీప్లేస్‌మెంట్ లేదు.. రాదు. కరెక్ట్ గా ఇప్పుడు ఆమె పాత్ర అవసరం అయింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో ‘గుండ‌మ్మ‌’ పాత్ర అవ‌స‌ర‌మైంది. ఆమెలా ఎవరు నటిస్తారు అని యూనిట్ మొత్తం అన్ని ఇండస్ట్రీలోనూ గాలించింది.

కానీ ఫలితం లేదు. ఆ పాత్రను రీప్లేస్ చేయ‌డం వారి వ‌ల్ల కాలేదు. అందుకే క్రిష్ సూర్యకాంతం పాత్ర‌ని లేకుండానే సినిమా తీసేశాడట. ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్ లో గుండ‌మ్మ క‌థ‌కు సంబంధించిన ఓ సీన్‌ని షూట్ చేశారు. కానీ అందులో తెలివిగా సూర్యకాంతం పాత్ర‌ని స్కిప్ చేశారు. అలానే కాంతారావు పాత్ర, మోహన్ బాబు పాత్ర కూడా ఎన్టీఆర్ బయోపిక్‌లో క‌నిపించ‌ద‌ని టాక్‌.

Similar News