దీపికా అడిగితే ఇచ్చేస్తారా!!

నాగ్ అశ్విన్ – ప్రభాస్ సినిమా పాన్ ఇండియా రేంజ్ కాదు.. ఇంటర్నేషనల్ రేంజ్ లో రెడీ కాబోతుంది అంటూ… సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ప్రభాస్ [more]

Update: 2020-06-18 04:46 GMT

నాగ్ అశ్విన్ – ప్రభాస్ సినిమా పాన్ ఇండియా రేంజ్ కాదు.. ఇంటర్నేషనల్ రేంజ్ లో రెడీ కాబోతుంది అంటూ… సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా దాదాపుగా 350 నుండి 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది అని.. ప్రభాస్ రేంజ్ సినిమా సినిమాకి మారిపోతుంది అని సోషల్ మీడియా టాక్. అయితే ఈ సినిమాని ఇంటర్ నేషనల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు కాబట్టి.. ఈ సినిమా కోసం హాలీ వుడ్ టెక్నీషియన్స్ తో పాటుగా బాలీవుడ్ స్టార్స్ కూడా పని చేయబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే నాగ్ అశ్విన్ ప్రభాస్ కోసం బాలీవుడ్ హాట్ అండ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొనేని సంప్రదించినట్టుగా టాక్ ఉంది. దీపికా కూడా నాగ్ అశ్విన్ ప్రపోజల్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా.. నాగ్ అశ్విన్ తెరకెక్కించియాన్ మహానటి ని కూడా చూసి నాగ్ అశ్విన్ డైరెక్టర్ స్కిల్స్ పై ప్రశంశలు కురిపించడంతో.. ప్రభాస్ సినిమాలో దీపికా ఫిక్స్ అన్నారు.

అయితే దీపికా పదుకొనే ప్రభాస్ తో కలిసి నటించడానికి నాగ అశ్విన్ ఆమెని ఒప్పించాడని.. అయితే నాగ్ అశ్విన్ కి ఈ సినిమాలో నటించేందుకు గాని దీపికా కొన్ని కండిషన్స్ పెట్టింది అనే టాక్ నడుస్తుంది. దీపికా పదుకొనె తాను ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాలి అంటే గనక తనకు ఈ సినిమా హిందీ హక్కులు కావాలని అడిగినట్లుగా చెబుతున్నారు. పారితోషకం కింద హిందీ హక్కులను దీపికా అడిగిందని అంటున్నారు. బాలీవుడ్ లో దీపికా రేంజ్ క్రేజ్ ఏమిటనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే దీపికా కండిషన్స్ కి నాగ్ అశ్విన్ అండ్ టీం ఒప్పుకుంటుందో లేదో చూడాలి. 

Tags:    

Similar News