హీరోయిన్ గా హిట్.. నిర్మాతగా ఫెయిల్

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే.. బాజీరావు మస్తానీ, పద్మవత్ లాంటి సినిమాల్లో నటించింది. దీపికా పదుకొనే తాజాగా నిర్మాతగా మారి ఛపాక్ సినిమా చేసింది. హీరోయిన్ [more]

Update: 2020-01-12 05:05 GMT

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే.. బాజీరావు మస్తానీ, పద్మవత్ లాంటి సినిమాల్లో నటించింది. దీపికా పదుకొనే తాజాగా నిర్మాతగా మారి ఛపాక్ సినిమా చేసింది. హీరోయిన్ గా నటిస్తూనే ఆ సినిమాని దీపికా పదుకొనే నిర్మించింది. జనవరి 10 న విడుదలైన ఛపాక్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ బయోపిక్ గా ఛపాక్ మూవీ లో దీపికా నటించింది. సినిమా మీద భారీ హైప్ అయితే లేదు. ఎందుకంటే కమర్షియల్ ఫిల్మ్ కాదు కాబట్టి. అయినా దీపికా తన శక్తి కొలది ఈసినిమాకి ప్రమోషన్స్ తో హైప్ లేపింది. అయితే సినిమాకి హిట్ టాక్ అయితే పడింది కానీ.. వసూళ్ల పరంగా ఛపాక్ మాత్రం డల్ అయ్యింది.

మొదటిరోజు కేవలం 4.77 కోట్ల వసూళ్లను రాబట్టి ప్లాప్ లిస్ట్ లోకోచ్సింది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ కధనం ప్రకారం హైఎండ్ మల్టీప్లెక్సుల్లో మాత్రమే ఛపాక్ కనబడుతుంది అని… మిగతా థియేటర్స్ లో ఛపాక్ అంతగా ఎక్కడం లేదని.. అయితే ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఛపాక్ పుంజుకునే అవకాశం ఉండచ్చని ఊహిస్తున్నారు. ఇక మాస్ కి ఈ సినిమా నచ్చకపోవడంతో బిసి సెంటర్స్ లో ఛపాక్ కలెక్షన్స్ కొల్లగొట్టలేక చేతులెత్తేసింది. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా యాసిడ్ బాధితురాలిగా ఇరగదీసి విమర్శకుల ప్రశంసలు పొందింది. కానీ పాపం నిర్మాతగా మాత్రం ఫెయిల్ అయినట్లే కనబడుతుంది. కాకపోతే ఈ సినిమాకి ఓ అన్నంత బడ్జెట్ ఎక్కలేదు కనక… దీపికా ఒక మోస్తరుగా సేఫ్ అయినట్లే.

Tags:    

Similar News