అది మరి ఎక్కువేమో?

నాగ అశ్విన్ అనుకున్నది సాధించాడు. ప్రభాస్ కోసం బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే ని దించుతున్నాడు. మొన్నటివరకు దీపికా.. ప్రభాస్ హీరోయిన్ అన్నప్పటికీ.. నిన్న నాగ్ అశ్విన్ [more]

Update: 2020-07-22 06:11 GMT

నాగ అశ్విన్ అనుకున్నది సాధించాడు. ప్రభాస్ కోసం బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే ని దించుతున్నాడు. మొన్నటివరకు దీపికా.. ప్రభాస్ హీరోయిన్ అన్నప్పటికీ.. నిన్న నాగ్ అశ్విన్ దాన్ని ఫైనల్ చేసి అందరికి షాకిచ్చాడు. పాన్ ఇండియా కాదు.. ప్రభాస్ తో తాను చెయ్యబోయే సినిమా పాన్ వరల్డ్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా కోసం కింగ్ కి సరిపొయ్యే క్వీన్ ని తెస్తున్న అంటూ తన సినిమా ఎలా ఉండబోతుందో నాగ్ అశ్విన్ హింట్ ఇచ్చేసాడు. కింగ్, క్వీన్ అంటున్నాడంటే.. నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమాని  రాజుల కాలం నాటి కథతో తెరకెక్కించబోతున్నట్టు అర్ధమవుతుంది. మరి పాన్ వరల్డ్ మూవీ కోసం దీపికాని తీసుకుంటే.. పద్మావత్ సినిమాతో బాలీవుడ్ లో 600 కోట్లకి పైగా కలెక్ట్ చేసి తన సత్తా చూపించితిన్ దీపికా ఈ సినిమా కోసం ఎంత తీసుకుంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.

అయితే నాగ్ అశ్విన్ – ప్రభాస్ మూవీ కోసం దీపికా పదుకొనే పదో పరకో కాదు…. ఏకంగా 30 కోట్ల పారితోషకం అందుకోబోతుందట. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. సౌత్ కి ఈ సినిమాతోనే దీపికా పరిచయం. అయినా పాన్ వరల్డ్ మూవీ, బాలీవుడ్ లో ఫుల్ ఫేమ్. అందుకే దీపికా అడిగింది కాదనకుండా వైజయంతి వారు ఆ 30 కోట్లు ఇచ్చేస్తున్నారట. అయితే దీపికా పదుకొనెకి ఎంతిస్తే ఏంటి.. ఈ కాంబినేషన్ పట్ల ప్రభాస్ అభిమానులు తెగ ఆనందపడిపోతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి దీపికా హైట్ కి, ప్రభాస్ హైట్ కి పర్ఫెక్ట్ మ్యాచ్. అలాగే ప్రభాస్ స్టార్ డం కి, దీపికా స్టార్ డం తోడైతే సినిమాపై అంచనాలు ఆకాశన్నంటడం ఖాయం.

Tags:    

Similar News