దీపికా మెయిన్.. ఇంకొకరు?

నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబోలో తెరకెక్కబోయే సోసియో ఫాంటసీ మూవీ కోసం బాలీవుడ్ బడా హీరోయిన్ దీపికా పాడుకోన్నేయి తీసుకొస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో [more]

Update: 2020-07-31 03:34 GMT

నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబోలో తెరకెక్కబోయే సోసియో ఫాంటసీ మూవీ కోసం బాలీవుడ్ బడా హీరోయిన్ దీపికా పాడుకోన్నేయి తీసుకొస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో ప్రభాస్ కి తగిన రాణి దీపికానే అని నాగ్ అశ్విన్ నమ్ముతున్నాడు. అదే విషయం చెప్పాడు కూడా. అయితే దీపికా పదుకొనె ప్రభాస్ సినిమా కోసం అనేక కండిషన్స్ పెట్టడమే కాకుండా పారితోషకం పరంగా 30 కోట్లు డిమాండ్ చేస్తే.. 20 కోట్లకి ఒప్పించారనే టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి సరిసమానమైన పాత్ర దీపికా పదుకొనేకి ఉండబోతుంది. అందుకే దీపికా పదుకొనే కూడా ప్రభాస్ సినిమా చెయ్యడానికి ఒప్పుకుంది అని అంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా మూడో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఉండబోతుందట.

అయితే ఈ సినిమాలో దీపికా పదుకొనె మెయిన్ లీడ్ హీరోయిన్ కాగా.. మరొక హీరోయిన్ కి కూడా కథ రీత్యా ఛాన్స్ ఉందట. అయితే ఆ సెకండ్ హీరోయిన్ ని నాగ్ అశ్విన్ సౌత్ హీరోయిన్ నే తీస్కోబోతున్నాడని.. అయితే ఎక్కువ ప్రాధాన్యత లేకపోయినా.. సెకండ్ హీరోయిన్ కి స్కోప్ ఎక్కువే అంటున్నారు. ప్రభాస్ కి సెకండ్ హీరోయిన్ తో ఓ డ్యూయెట్ కూడా ఉంటుంది అని అంటున్నారు. మరి ప్రభాస్ కి సరైన జోడి దీపికా పదుకొనే వన్ అఫ్ ద హీరోయిన్. మరి నాగ అశ్విన్ ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా ఏ సౌత్ బేబీ ని తీసుకొస్తాడో అనే ఆసక్తి అందరిలో పెరిగిపోతుంది.

Tags:    

Similar News