ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్..!

స్టార్ హీరోలతో సమానంగా విజయ్ దేవరకొండ క్రేజ్ యూత్ కి పాకిపోయింది. విజయ్ దేవరకొండకి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. అర్జున్ రెడ్డితో యూత్ కి కనెక్ట్ అయిన [more]

Update: 2019-03-23 07:14 GMT

స్టార్ హీరోలతో సమానంగా విజయ్ దేవరకొండ క్రేజ్ యూత్ కి పాకిపోయింది. విజయ్ దేవరకొండకి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. అర్జున్ రెడ్డితో యూత్ కి కనెక్ట్ అయిన విజయ్ గీత గోవిందంతో ఫామిలీస్ కి కనెక్ట్ అయ్యాడు. అందుకే విజయ్ దేవరకొండ సినిమా సెట్స్ మీదున్నా ఆ సినిమాకి ఎనలేని క్రేజ్, అంచనాలు ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో ఉంటున్నాయి. గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ సినిమాల మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది. అందుకే విజయ్ కూడా ఎడాపెడా సినిమాలేవీ ఒప్పుకోకుండా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది.

వాటాలూ పంచేసుకున్నారు

భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ సినిమాకు సంబంధించి మొన్న వదిలిన టీజర్ తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని మైత్రి మూవీస్, విజయ్ దేవరకొండ బంధువు యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఇప్పటికే బిజినెస్ స్టార్ట్ చేసిన డియర్ కామ్రేడ్ ని ఇద్దరు నిర్మాతలు ఎవరి వాటాని వాళ్లు పంచేసుకున్నారట. సీడెడ్, నైజాం యాష్ రంగినేని వాటాకు రాగా ఆంధ్ర మాత్రం మైత్రీ వాటాకు వచ్చింది. అయితే యాష్ తన డియర్ కామ్రేడ్ సీడెడ్, నైజాం వాటాను 11 కోట్లకు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకు అమ్మేసినట్లుగా సమాచారం.

భారీగా లాభాలు ఖాయం

ఇక నైజాం ఏరియాను మాత్రం ఏషియన్ సునీల్ కు అడ్వాన్స్ మీద డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక మైత్రి మూవీస్ వారు కూడా ఆంధ్ర హక్కులను 12 కోట్ల రేషియో పద్దతిలో మర్కెట్ చేసుకుంటుందట. ఆంధ్ర, నైజం, సీడెడ్ కే 23 కోట్లు వస్తే దానితో పాటు డియర్ కామ్రేడ్ ఓవర్సీస్, కర్ణాటక, తమిళనాడు, కేరళ హక్కులన్నీ కలిపి ఓ 40 కోట్ల పైనే థియేట్రికల్ బిజినెస్ చేసేలా కనబడుతుంది. అలాగే డిజిటల్, శాటిలైస్ హక్కులు కూడా ఉన్నాయి. మరి అన్నీ కలిపి డియర్ కామ్రేడ్ నిర్మాతలకు లాభాలే లాభాలు అన్నట్టుగా ఉంది.

Tags:    

Similar News