ఆర్-ఆర్-ఆర్ పోస్టర్ నిజమేనా

దసరా పండగ రోజు తమ సినిమాల టైటిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ లుక్ టీజర్స్ ను రిలీజ్ చేశారు. అలానే ఎటువంటి అధికార ప్రకటన లేకుండా [more]

Update: 2019-10-09 07:47 GMT

దసరా పండగ రోజు తమ సినిమాల టైటిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ లుక్ టీజర్స్ ను రిలీజ్ చేశారు. అలానే ఎటువంటి అధికార ప్రకటన లేకుండా ఆర్-ఆర్-ఆర్ యూనిట్ నుంచి కూడా టైటిల్ పోస్టర్ వచ్చింది. రామ రౌద్ర రుషితం అనే టైటిల్ తో ఒక పోస్టర్ ని సైలెంట్ గా రిలీజ్ చేసారు . కానీ అది ఒరిజినల్ పోస్టర్ కాదు ఫ్యాన్ మేడ్ పోస్టర్.
అచ్చం ఒరిజినల్ పోస్టర్ లా ఉండే ఈ పోస్టర్ నిజమే అనుకుని చాలామంది షేర్స్ చేశారు. అంతేకాదు ఇండస్ట్రీలో కొంతమంది పీఆర్ఓలు కూడా షేర్ చేయడం తో అది అనుకుని అంతా షేర్లు, లైకులు కొట్టడం స్టార్ట్ చేశారు. అలా ఆ పోస్టర్ వైరల్ అయింది.

ఇదే ఫైనలా….?

అదే నిజమైన టైటిల్ కాదు. రాజమౌళి ఆల్రెడీ RRR కి ఫుల్ ఫామ్ ఏమి ఉండదు అని RRR తోనే వెళ్ళిపోతాం అని ఆమధ్య ప్రకటించాడు. కాకపోతే ఆర్-ఆర్-ఆర్ సినిమాకు రామ రౌద్ర రుషితం అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. టైటిల్ పై ఇంత వరకు ఎటువంటి న్యూస్ లేకపోవడంతో అంతా ఇదే
టైటిల్ అనుకుంటున్నారు.

 

Tags:    

Similar News