వార్డు మెంబర్ పాత్రలో రానా..?

దగ్గుబాటి రానా హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందే పొలిటికల్ ఫిలిం లీడర్ తో. ఆ సినిమాలో ముఖ్యమంత్రిగా రానా అదరగొట్టేసాడు. ఇక తరవాత హీరో పాత్రలే కాదు.. [more]

Update: 2019-03-23 07:51 GMT

దగ్గుబాటి రానా హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందే పొలిటికల్ ఫిలిం లీడర్ తో. ఆ సినిమాలో ముఖ్యమంత్రిగా రానా అదరగొట్టేసాడు. ఇక తరవాత హీరో పాత్రలే కాదు.. ఏ స్పెషల్ క్యారెక్టర్ వచ్చినా కాదనకుండా చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. విలన్ క్యారెక్టర్ అయినా.. ఏ క్యారెక్టర్ అయినా రానా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. మొన్నామధ్యన తేజ దర్శకత్వంలోని నేనే రాజు నేనే మంత్రి సినిమాలో పోలిటికల్ చైర్స్ గేమ్ ఆడుతూ భార్య మాట కోసం సీఎం కావాలనే జోగేంద్ర క్యారెక్టర్ లో రానా నటన అద్భుతమే. ఇక ఈ ఏడాది కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో చంద్రబాబు పాత్రలోనూ రానా నటన అదుర్స్. మరి తాను చేసిన చాలా సినిమాల్లో పొలిటికల్ లీడర్ గా రానా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

మరోసారి రాజకీయ క్యారెక్టర్ లో…

తాజాగా రానా మరో మూవీలో పొలిటికల్ గెటప్ లో కనిపించబోతున్నాడనే న్యూస్ హైలెట్ అయ్యింది. సాయి పల్లవి మెయిన్ లీడ్ లో నీదీ నాదీ ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న విరాటపర్వం 1992 అనే చిత్రంలో రానా హీరో క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. అయితే ఆ సినిమాలో రానా ఒక పంచాయితీ వార్డ్ మెంబర్‌గా కనిపించబోతున్నాడని అంటున్నారు. మరి ఇప్పటివరకు రానా పాలిటిక్స్ బేస్ చేసుకుని చేసిన చిత్రాలన్నీ మంచి ఫలితాన్నే ఇచ్చాయి. అంటే ఇప్పుడు ఈ విరాటపర్వం కూడా రాజకీయ నేపథ్యంలో కాకపోయినా… రానాని మాత్రం ఒక పర్పస్ కోసం దర్శకుడు వేణు ఇలా పొలిటికల్ అవతారమెత్తిస్తున్నాడు. మరి వార్డ్ మెంబెర్ గా రానా ఈ సినిమాలో కూడా చెలరేగిపోవడం ఖాయంటున్నారు. ఇక రానా తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ యమ బిజీగా ఉన్నాడు.

Tags:    

Similar News