తెలుగు వాళ్లూ వెయిటింగ్ ఇక్కడ..!

Update: 2018-10-25 10:45 GMT

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ - మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ చిత్రం ‘సర్కార్’ నవంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఇంకా రెండు వారాలు సమయం ఉన్నా.. ఇప్పటి నుండే తమిళనాట విజయ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అసలే విజయ్ కు తమిళనాడులో ఫ్యాన్స్ ఎక్కువ. ఈ క్రేజ్ తమిళనాడుతో పాటు మిగితా దక్షిణాది రాష్ట్రాలకు కూడా పాకింది. మాస్ హీరో విజయ్ కు తమిళనాడు తరువాత కేరళలో ఎక్కువ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. అక్కడ 'సర్కార్' సినిమా ఫ్యాన్స్ షోస్ ఏకంగా 200 పైనే వేస్తున్నారట. దీనిని బట్టి విజయ్ కు అక్కడ క్రేజ్ ఎటువంటిదో ఆలోచించవచ్చు.

తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి

కేరళ తరువాత తెలుగు వాళ్లు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మురగదాస్ - విజయ్ చిత్రం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి తోడు నిన్న ఈ సినిమా తెలుగు వెర్షన్ టీజర్ రిలీజ్ అయ్యి 11లక్షల వ్యూస్ ను రాబట్టుకుంది. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం అని ట్రేడ్ చెబుతున్నారు. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికీ మంచి బిజినెస్ జరిగింది. ఇన్ని పోజిటివ్స్ మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటించింది. ఆస్కార్ విన్నర్ రహమాన్ సంగీతం అందించాడు

Similar News