జైలుకు జానీ మాస్టర్

తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న టాలెంటెడ్ కొరియోగ్ర‌ాఫ‌ర్స్‌ లో జానీ మాస్ట‌ర్ కూడా ఒక‌రు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి అగ్ర హీరోల‌కు కూడా ఈయ‌న కొరియోగ్ర‌ఫీ [more]

Update: 2019-03-28 06:16 GMT

తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న టాలెంటెడ్ కొరియోగ్ర‌ాఫ‌ర్స్‌ లో జానీ మాస్ట‌ర్ కూడా ఒక‌రు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి అగ్ర హీరోల‌కు కూడా ఈయ‌న కొరియోగ్ర‌ఫీ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు వంద‌ల పాట‌ల‌కు డాన్స్ స్టెప్స్ వేయించిన ఈయ‌న ఇప్పుడు జైలుకు స్టెప్స్ వేస్తున్నాడు. ఓ ఛీటింగ్ కేసులో ఈయ‌న ఇరుక్కున్నాడు. ఇప్పుడు జైలుకు కూడా వెళ్లాడు. ఈయ‌న‌తో పాటు మ‌రో ఐదుగురిని కూడా జైలుకు త‌ర‌లించాల‌ని మేడ్చ‌ల్ కోర్టు ఆదేశించింది. ఈయ‌న‌పై నాలుగేళ్ల కింద ఈ కేసులు న‌మోద‌య్యాయి. 2015 సంవత్సరంలో సెక్ష‌న్ 354, 324, 506 కింద జానీ మాస్ట‌ర్ పై కేసు నమోదు చేయగా.. ఇన్నాళ్ల‌కు దీనిపై తీర్పు వ‌చ్చింది. సెక్ష‌న్ 354 కేసుని కొట్టివేసి.. 324, 506 సెక్ష‌న్స్ మాత్రం నిజ‌మే అని నిర్థారించింది కోర్టు. దాంతో ఈయ‌న‌కు 6 నెలల శిక్ష విధించింది. జానీ మాస్టర్ తో పాటు మరో 5 మంది కుడా జైలుకు వెళ్లారు. అయితే ఈయ‌న చెక్ బౌన్స్ కేసుతో పాటు మ‌రిన్ని కేసుల విష‌యంలో నిందితుడిగా తేలింది. ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపర్చటం, హ‌త్యాయ‌త్నం చేయ‌డం వంటి చర్యలు ఈ సెక్షన్ల కిందకి వస్తాయి.

Tags:    

Similar News