రామ్ చరణ్ కే డౌటు… ఎన్టీఆర్ ఏం చేస్తాడో?

ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చిన్న నిర్మతలేమిటి… భారీ బడ్జెట్ మూవీ నిర్మాతలేమిటి అందరూ ఘొల్లుమంటున్నారు. సినిమా షూటింగ్ వాయిదా పడి అప్పుడే [more]

Update: 2020-04-18 10:16 GMT

ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చిన్న నిర్మతలేమిటి… భారీ బడ్జెట్ మూవీ నిర్మాతలేమిటి అందరూ ఘొల్లుమంటున్నారు. సినిమా షూటింగ్ వాయిదా పడి అప్పుడే నెల రోజులు గడిచిపోయింది. ఇంకా 15 ర్రోజుల లాక్ డౌన్.. ఎప్పుడు పూర్తయ్యి ఎప్పుడు మళ్ళీ సినిమాలు పట్టాలెక్కుతాయో తెలియదు, అయితే అందరిలో ఎక్కువగా ఆసక్తి ఉన్న RRR సినిమా జులై 31 నుండి జనవరి 8 కి వాయిదా పడింది. మళ్లీ కరోనా కారణంగా జనవరి 8 నుండి ఏప్రిల్ అంటూ ప్రచారం జరుగుంది. అందుకే రామ్ చరణ్ ఆచార్య సినిమాలో నటించడం పై అప్పుడే కొరటాలలో  టెంక్షన్ మొదలైంది. ఇప్పటికే చరణ్ RRR తో లాకయితే… నేనున్నా అంటూ మహేష్ కొరటాలకు భరోసా కూడా ఇచ్చాడు. ఇక RRR హీరో రామ్ చరణ్ పరిస్థితే అలా ఉంటె… ఎన్టీఆర్ నెక్స్ట్ ఏమవుతుందో అంటున్నారు.

అంటే RRR తో పాటుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ చేసాడు. ఆ సినిమా కూడా ఈ ఏప్రిల్ నుండే పట్టాలెక్కాల్సి ఉంది. కానీ కరోనా అడ్డం పడింది. మరి ఎన్టీఆర్ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ ముగియగానే RRR కోసం బిజీ అయితే త్రివిక్రమ్ పరిస్థితి ఏమిటో.. ఎన్టీఆర్ గనక డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక పొతే త్రివిక్రమ్ కూడా మహేష్ ప్రపోజల్ కి టెంప్ట్ అవుతాడేమో అనిపిస్తుంది. మరోపక్క త్రివిక్రమ్ ఎన్టీఆర్ వచ్చేవరకు ఓ చిన్న సినిమా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అనే ప్లాన్ లో ఉన్నాడనే టాక్ వినబడుతుంది

Tags:    

Similar News