విడుదల తేదీల విషయంలో గజిబిజి?

ప్రస్తుతం సినిమాల విడుదల తేదీలంతా గజిబిజి గందరగోళంగా ఉన్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 2 తర్వాత విడుదల డేట్స్ ఇచ్చిన సినిమాలన్నీ పక్కా డేట్ కి వస్తాయో రావో [more]

Update: 2020-03-19 06:49 GMT

ప్రస్తుతం సినిమాల విడుదల తేదీలంతా గజిబిజి గందరగోళంగా ఉన్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 2 తర్వాత విడుదల డేట్స్ ఇచ్చిన సినిమాలన్నీ పక్కా డేట్ కి వస్తాయో రావో తెలియదు. ప్రస్తుత థియేటర్స్ బంద్ వలన వాయిదా పడిన సినిమాలు ఎప్పుడు ఏ డేట్ లాక్ చెయ్యాలో తెలియదు. ఏప్రిల్, మే సెలవుల కి చాల సినిమాలు లైన్ కట్టేశాయి. ఈమధ్యలో చిన్న సినిమాలు వదలాలి అంటే మిగతా నిర్మాతలు ఒప్పుకోరు. ప్రస్తుతం వాయిదా పడిన సినిమాల నిర్మాతలు ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకున్నారు.

కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ భాష అయినా.. సినిమాల విడుదల తేదీ మార్చి.. మరో తేదీ సెట్ చేసుకోవడానికి నానా తంటాలు పడాలి. కరోనా వైరస్ వలన ఒక్కసారిగా పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఇదివరకు నిర్మాతలు నష్టపోకుండా… అందరూ కూర్చుని మాట్లాడుకుని సినిమాల విడుదలలో కన్ఫ్యూజన్ లేకుండా సెటిల్ చేసుకునేవారు. కానీ తాజా పరిస్థితులు అలా కాదు. ఇప్పుడు వాయిదా వేసిన సినిమాలు ఎప్పుడు విడుదల చెయ్యాలి… మే చివరికి వరకు మంచి వారం దొరక్కపోతే.. జూన్ కి వెళ్లాలా లేదంటే ఏంటి పరిస్థితి అనేది మాత్రం నిర్మాతలకు అర్ధం కావడం లేదు. ఇక కొంతలో కొంత నయం ఏమిటంటే.. ప్రస్తుతం తెలుగులో భారీ మూవీస్ విడుదలకు లేకపోవడం… వేసవి సెలవలకి భారీ బడ్జెట్ మూవీస్ దూరమవడంతో.. చిన్న, మీడియం నిర్మాతలు ఊపిరిపీపీల్చుకుంటున్నారు. కానీ చిన్న సినిమాల విడుదల సమయంలో నిర్మాతలకు కీచులాట తప్పేలాలేదు.

Tags:    

Similar News