జబర్దస్త్ ని వదలని కరోనా?

కరొనకి ధనిక, పేద అన్న భావం లేదు. ముసలోడా.. చంటిపిల్లడా అనే తారతమ్యము లేదు. కరోనా మహమ్మారి ముందు ఎవ్వరైనా ఒకటే ఆన్నట్టుగా పరిస్థితి రోజు రోజుకి [more]

Update: 2020-07-08 06:09 GMT

కరొనకి ధనిక, పేద అన్న భావం లేదు. ముసలోడా.. చంటిపిల్లడా అనే తారతమ్యము లేదు. కరోనా మహమ్మారి ముందు ఎవ్వరైనా ఒకటే ఆన్నట్టుగా పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. కరోనా కారణంగా పలు రంగాల్లో ఉపాధి కోల్పోయి అనేకమంది రోడ్డునపడ్డారు. అయినా కరోనా మహమ్మారి శాంతించడం లేదు. రోజుకి వేలల్లో జనాల్ని తనతో తీసుకుపోతుంది. కరోనా దెబ్బకి ఒకరితో మాట్లాడాలన్నా భయమే. కలిసి తినాలన్న, పడుకోవాలన్న, చెయ్యి కలపాలన్న భయంగానే ఉంది. ఇక అన్ని రంగాలకన్నా సినిమా రంగం మరీ ఘోరంగా తయారయ్యింది. ప్రభుత్వం అనుమతులిచ్చినా షూటింగ్స్ చేసుకోలేని పరిస్థితి. సినిమాల సంగతి ఎలా ఉన్న సీరియల్స్ షూటింగ్స్ మొదలయ్యాయి.. కానీ ఒక్కో రోజు ఒక్కో సీరియల్ నుండి ఒక్కో నటుడు కరోనా పాజిటివ్ గా తేలడంతో.. మిగతా ఆర్టిస్ట్ లకు ఒణుకు పుడుతుంది. టివి ఆర్టిస్టులకు కరోనా పాజిటివ్ రావడంతో కొన్ని సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోయాయి.

ఇక తాజాగా కరోనా సెగ టాప్ కామెడీ షో జబర్దస్త్ ని తాకింది అనే టాక్ వినబడుతుంది. గత మూడు నెలలుగా కరోనా లాక్ డౌన్ తో జబర్దస్త్ షూటింగ్ కి బ్రేకిచ్చి.. రెండు వారల క్రితం నుండి ఫ్రెష్ ఎపిసోడ్స్ తో మళ్ళీ క్రీజులోకొచ్చింది. గత రెండు వారాలుగా జబర్దస్త్ కామెడీ ఖతర్నాక్ గా ఆకట్టుకుంటుంది. మల్లి ఈటివి జబర్దస్త్ ఏపీసోడ్స్ తో టిఆర్పి పరంగా టాప్ లోకి దూసుకెళ్లడం ఖాయమనుకునే లోపు హైపర్ ఆది టీం లోని ఓ సభ్యుడు కరోనా బారిన పడడంతో.. హైపర్ ఆది టీం మొత్తం కరోనా టెస్టులు చేయించుకున్నారట. అంతేకాకుండా టీం లీడర్స్ అంత కరోనా టెస్ట్ లు చేయించుకున్నరని.. వాళ్ళంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని తెలుస్తుంది. అయితే జబర్దస్త్ టీంలోని కొంతమందికి కరోనా పాజిటివ్ అన్నట్లుగా తేలితే మల్లి జబర్దస్త్ షూటింగ్ ని ఆపేస్తారట. అయితే కామెడీ ప్రియులు కంగారు పడక్కర్లేదని.. ఇప్పటికే జబర్దస్త్ నాలుగైదు ఎపిసోడ్స్ షూటింగ్ జరగడం వలన మరో రెండు వారాలకి వచ్చిన ఇబ్బంది ఏం లేదని మల్లెమాల టీం చెబుతున్న మాట.

Tags:    

Similar News