టాలీవుడ్ లో మరో టైటిల్ వివాదం

క‌ళాధ‌ర్ కొక్కొండ న‌టిస్తూ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం గుణ‌. న‌టులు సెల్వ‌రాజ్, దిల్ ర‌మేష్ ముఖ్య‌ పాత్ర‌లు పోషిస్తున్నారు. స‌నాతన క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపోందుతున్న ఈ [more]

Update: 2019-05-09 12:36 GMT

క‌ళాధ‌ర్ కొక్కొండ న‌టిస్తూ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం గుణ‌. న‌టులు సెల్వ‌రాజ్, దిల్ ర‌మేష్ ముఖ్య‌ పాత్ర‌లు పోషిస్తున్నారు. స‌నాతన క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపోందుతున్న ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా గుణ టైటిల్ ని ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కొత్త సినిమాకు పెట్ట‌డంపై గుణ చిత్రం న‌టుడు, ద‌ర్శ‌క‌ నిర్మాత క‌ళాధ‌ర్ కొక్కొండ మండిప‌డుతున్నారు. ఇదివ‌ర‌కే గుణ టైటిల్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించిన‌ట్లు తెలిపారు. తమ సినిమా టైటిల్ ను అర్జున్ జంధ్యాల టీమ్ వాడుకుంటూ.. ఆ టైటిల్ పక్కన ‘369’ అంకెను తగిలించ‌డంపై కళాధర్ కొక్కొండ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తో పాటు ఏపీ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో కూడా ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు. త‌మ‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడుతామ‌ని అన్నారు.

Tags:    

Similar News