బిగ్ బాస్ పై ఫిర్యాదు..!

Update: 2018-08-25 09:20 GMT

బిగ్ బాస్ షో మీద హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు. షో పేరుతో 16 మందిని ఒకే ఇంట్లో బందించి అందులో నుండి బయటికి రాకుండా అడ్డుకోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ 16 మందితో వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారని.. దాని వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆరోపించారు. కేవలం టీఆర్పీలను పెంచుకునేందుకే షో ఉందని పేర్కొన్నారు. టాస్క్‌ ల పేరుతో వారిని ఇబ్బంది పెడుతున్నారని.. బాత్రూములు కడగాలని, మరేదో చేయాలని బిగ్ బాస్ చిత్ర విచిత్ర ఆదేశాలతో పోటీదారులను హింసిస్తున్నారని ఆరోపించారు.

సమాజంలోకి చెడు సంకేతాలు

ఇలా చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ టాస్క్‌ ల వల్ల సమాజంలోకి చెడు సంకేతాలు వెళ్తున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ షో ని తక్షణమే నిలిపివేయాలని ఆయన హెచ్ఆర్‌సీ లో ఫిర్యాదు చేశారు. మరి దీనికి బిగ్ బాస్ షో వారు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Similar News