డియర్ కామ్రేడ్ కి తమిళంలో కష్టాలు తప్పలేదు

కొత్త దర్శకుడు భరత్ కమ్మ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించిన చిత్రం “డియర్ కామ్రేడ్” ఈనెల 26 న గ్రాండ్ [more]

Update: 2019-07-24 07:46 GMT

కొత్త దర్శకుడు భరత్ కమ్మ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించిన చిత్రం “డియర్ కామ్రేడ్” ఈనెల 26 న గ్రాండ్ గా విడుదల కానుంది. సౌత్ లో ప్రధాన భాషల్లో రిలీజ్ అవుతున్న ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ శుక్రవారం ఈమూవీ తెలుగు లో ఎటువంటి పోటీ లేకుండా సోలో గా రిలీజ్ అవుతుంది. కానీ తమిళంలో మాత్రం ఈ సినిమాతో పాటు మరో 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఈ 6 లో మెయిన్ గా స్టార్ కమెడియన్ అయిన సంతానం నటించిన “ఏ1”, అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన “కొలైయుధిర్ కాలం” చిత్రాలు మాత్రమే హైప్ ఉన్న చిత్రాలు. మిగిలినవి అన్ని చిన్న సినిమాలు కావడం విశేషం. మరి ఇంత పోటీ మధ్యన విజయ్ అక్కడ ఎంతవరకు నెట్టుకొస్తాడో చూడాలి. ట్రైలర్ కి ఇప్పటికే అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రన్ టైం వచ్చేసి 2 గంటల 44 నిముషాలు. కంటెంట్ మీద కాంఫిడెన్స్ తో అంత రన్ టైం ఉన్న పటించుకోట్లేదు మేకర్స్. ఇక ఈమూవీ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం హైలైట్ గా నిలవనుంది

Tags:    

Similar News