ఇక్కడ కూడా పోటీనేనా బాబులూ

సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో సినిమాల విడుదల డేట్స్ విషయం దగ్గరనుండి ప్రమోషన్స్ వరకు, అంతేకాకుండా సినిమా షూటింగ్ కంప్లీట్ అవడం దగ్గరనుండి డబ్బింగ్ వరకు అన్నిటిలో [more]

Update: 2020-01-04 05:34 GMT

సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో సినిమాల విడుదల డేట్స్ విషయం దగ్గరనుండి ప్రమోషన్స్ వరకు, అంతేకాకుండా సినిమా షూటింగ్ కంప్లీట్ అవడం దగ్గరనుండి డబ్బింగ్ వరకు అన్నిటిలో ఒకదాని మీద ఒకటి పోటీకి దిగుతూనే ఉన్నారు మహేష్, అల్లు అర్జున్ లు. వీరిద్దరి మధ్యన కోల్డ్ వార్ జరుగుతుంటే.. సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ డైరెక్ట్ వార్ చేస్తున్నారు. ఇక డేట్స్ విషయంలో తికమకలు పడి ఒకరు ఒకరోజు, మరొకరు ఇంకోరోజు వచ్చేందుకు అంగీకరించారు. ఇక సరిలేరు నీకెవ్వరూ నుండి సాంగ్స్ వస్తుంటే అల్లు అర్జున్ అలా నుండి టీజర్ వదలడం, సరిలేరు టీజర్ వస్తుంది అంటే ఆలా నుండి సాంగ్స్ వదలడం అబ్బా అన్నిటిలోను మహేష్ బాబు – అల్లు అర్జున్ పోటీ మమూలుగా లేదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా ఒకదాని తరవాత మరొకటి.

తాజాగా మరొక విషయంలోనూ అల్లు అర్జున్ – మహేష్ బాబు పోటీ ఏ రేంజ్ లో ఉందొ అర్ధమవుతుంది. అది సినిమా సెన్సార్లు విషయంలో. సరిలేరు నీకెవ్వరూ సెన్సార్ గురువారం జరిగింది. అలా వైకుంఠపురములో సెన్సార్ శుక్రవారం అంటే నిన్న. మరి రెండు సినిమాలకు యు/ఏ సర్టిఫికెట్స్ ఇచ్చారు సెన్సారు సభ్యులు. సినిమా విడుదల తేదీలు, సాంగ్స్ రిలీజ్, ప్రమోషన్స్ లోను పోటీ.. తాజాగా సెన్సార్ తోనూ ఒకే రకమయిన సర్టిఫికెట్.. మరి ఇదంతా చూస్తుంటే మహేష్ బాబు అండ్ బన్నీ లు ఒకరికొకరు ఢీ అంటే ఢీ అన్నట్టుగా కనిపిస్తున్నారు.

మరోపక్క సరిలేరు నీకెవ్వరూ సినిమా సెన్సార్ టాక్ ప్రకారం.. యాక్ష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, పాట‌లూ.. అన్నీ వ‌ర్క‌వుట్ అయ్యాయని… క్లైమాక్స్ కూడా బాగా వ‌చ్చిందని తెలుస్తోంది. అలాగే ఆలా వైకుంఠపురములో కామెడీ ట్రాక్ తో పాటుగా విలన్ సముద్రఖని – బన్నీ ల మధ్యన కామెడీతో కూడిన యాక్షన్ కూడా సూపర్ అంటున్నారు. మరి రెండు సినిమాలకు కామన్ పాయింట్ కామెడీ వర్కౌట్ అవడమే. ఇక అన్నిటిలోను హీరోల విషయం ఇలా ఉంటే.. రేపు సినిమా విడుదలయ్యాక మా సినిమా కలెక్షన్స్ ఇంత అంటే మా సినిమా కలెక్షన్స్ ఇంత అంటూ నిర్మాతలు తన్నుకు చచ్చేలా కనబడుతున్నారు.

Tags:    

Similar News