ఇస్మార్ట్ శంకర్ తో పూరి కి వచ్చిందేమీ లేదు

ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవ్వడంతో పూరి ఇంటర్వూస్ లో ఏదిపడితే అది మాట్లాడుతున్నాడు అని ఇప్పుడున్న హీరోస్ అనుకుంటున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూ లో స్టార్ హీరో [more]

Update: 2019-07-25 08:07 GMT

ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవ్వడంతో పూరి ఇంటర్వూస్ లో ఏదిపడితే అది మాట్లాడుతున్నాడు అని ఇప్పుడున్న హీరోస్ అనుకుంటున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూ లో స్టార్ హీరో మహేష్ బాబు పై కామెంట్స్ చేసారు. మహేష్ కి హిట్స్ ఉన్న దర్శకులే కావాలని ఒకవేళ ఆయన ఇప్పుడు చేస్తా అని వచ్చినా నేను చేయను చెప్పడం తో కాంట్రవర్సీ కి దారి తీసింది. ఈ మాట విన్న తరువాత మహేష్ పూరి తో చేసే అవకాశం లేదు. అలానే ఎన్టీఆర్ రాష్ డ్రైవింగ్ చేస్తాడని మన అందరికి జాగ్రత్తగా వెళ్ళండి చెప్పిన మాటలు ఏమి పటించుకోడు అని పూరి అన్నారు.

అయితే ఇస్మార్ట్‌ శంకర్‌ని తెలుగు చిత్ర పరిశ్రమ ఫ్లూక్‌ హిట్‌గానే పరిగణిస్తోంది. ఈమూవీ కూడా పూరి గత చిత్రాల మాదిరిగానే ఉందని భావిస్తున్నారు. అందుకేనేమో పూరి తో సినిమా చేయడానికి ఏ స్టార్ హీరో ముందు రావడంలేదు. కనీసం సెకండ్‌ టయర్‌ హీరోలలో కూడా పూరితో చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. విజయ్ దేవరకొండ తో పూరి సినిమా అనుకున్నాడు కానీ విజయ్ ఏమో కొరటాల తో సినిమా చేస్తా అని చెపుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో తన సుడి మారిపోతుందని భావించిన పూరి కి పూర్వ వైభవం అయితే ఖచ్చితంగా రాలేదు.

Tags:    

Similar News