ఆ సినిమాలో అదే హైలైట్

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా గురించి ఇండస్ట్రీ లో మంచి పాజిటివ్‌ టాక్ వినిపిస్తోంది. అలా వినిపించడానికి కారణం [more]

Update: 2019-09-16 08:11 GMT

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా గురించి ఇండస్ట్రీ లో మంచి పాజిటివ్‌ టాక్ వినిపిస్తోంది. అలా వినిపించడానికి కారణం ఆ సినిమా యొక్క స్టోరీ. అల్లు అర్జున్ చిన్నప్పుడే తన ఇంటి నుండి వెళ్ళిపోయి మళ్లీ 25 ఏళ్ళు తరువాత తన ఇంటికి పనివాడిగా వచ్చి ఆ తండ్రి కష్టాలన్నీ తీర్చి, కొడుకుగా తన బాధ్యతలు నిర్వర్తించడం అనేది స్టోరీ.

దసరాకు టీజర్…

వినడానికి చాలా సింపుల్ గా ఉన్నా త్రివిక్రమ్ మార్క్ కామెడీ, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ ఇందులో బాగానే ఉన్నాయని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటె ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం తమన్ చాలా మంచి పాటలు ఇచ్చాడని తెలుస్తుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సినిమా కి తమన్ మ్యూజిక్ హైలైట్ అవుతుందని తెలుస్తుంది. దసరాకు కు టీజర్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా మహేష్ ‘సరిలేరు
నీకెవ్వరు’ కి పోటీ గా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.

 

Tags:    

Similar News