నిర్మాతలపై ఫైర్ అయినా కమెడియన్

ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో వెనక్కి నెట్టి వార్తల్లో నిలిచాడు తమిళ టాప్ కమెడియన్ వడివేలు. #Prayfornesamani హ్యాష్ ట్యాగ్‌తో అందరి ద్రుష్టి ఆకర్షించాడు [more]

Update: 2019-06-02 11:29 GMT

ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో వెనక్కి నెట్టి వార్తల్లో నిలిచాడు తమిళ టాప్ కమెడియన్ వడివేలు. #Prayfornesamani హ్యాష్ ట్యాగ్‌తో అందరి ద్రుష్టి ఆకర్షించాడు వడివేలు. గత నెల మే 30వ తేదిన తమిళ సినిమా ‘ఫ్రెండ్స్’ లో వడివేలు క్యారెక్టర్ ‘నేసమణికి సంబంధించి ‘Pray for Nesamani’ అనే హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో నడిచింది.

తన పాత్రకు అంతలా పేరు రావడానికి కారణం..దర్శకుడు సిద్దిఖీ అంటున్నారు నటుడు వడివేలు. తనకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడంతో ఆ క్యారెక్టర్ అంతా బాగా పండిందన్నారు. అలానే ఈ సందర్భంగా ఆయన నటిస్తూ ఆగిపోయిన చిత్రం ‘ఇంసై అరసన్ 24 ఏఎం పులికేసి’ సినిమా గురించి ప్రస్తావించారు.

తమిళ నిర్మాతలు సంఘం నా కెరీర్‌ను నాశనం చేయడానికి కంకణం కట్టుకుందన్నారు. తనకు సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. వడివేలు ఇందులో మూడు విభిన్న పాత్రల్లో నటించారు.

Tags:    

Similar News