కమెడియన్ గా సునీల్ పారితోషికం ఎంతో తెలుసా

Update: 2018-06-10 06:54 GMT

కమెడియన్ సునీల్ తన కెరీర్ స్టార్టింగ్ నుండే మంచి అవకాశాలతో ముందుకు సాగాడు. కమెడియన్ గా ఫుల్ బిజీగా ఉన్న టైంలో 'అందాల రాముడు' సినిమా నుండి ఆఫర్ రావడంతో.. హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సక్సెస్ అవ్వడంతో

కామెడీ వేషాలకి బై చెప్పేసి హీరోగానే తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు.

అయితే హీరోగా అయన తన కెరీర్ ని స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో రెండు మూడు సినిమాలు హిట్ తప్ప ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ దాదాపు ప్లాప్స్ యే. దాంతో సునీల్ తో సినిమా తీయడానికి భయపడిపోయారు నిర్మతలు. దాంతో ఆయన తిరిగి కమెడియన్ గా చేయడానికి రెడీ అయ్యినప్పుడు... వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ .. శ్రీను వైట్ల .. హను రాఘవపూడి సినిమాల్లో కమెడియన్ గా చేస్తున్నాడు. రోజుకి 4 లక్షల రూపాయలు పారితోషికంగా అందుకుంటున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్ లో వెన్నెల కిషోర్ తప్ప చెప్పుకోదగ్గ కమెడియన్స్ లేకపోవడంతో సునీల్ కి మళ్లీ కలిసొచ్చిందని చెప్పుకుంటున్నారు

Similar News