సునీల్ ఆయనను ఫాలో అయితే బాగుండేది

కమెడియన్ సునీల్ ప్రస్తుతం కామెడీ పాత్రలు చేస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడు. కానీ ఆశ్చర్యం ఏటంటే ఆయనకు సరైన కామెడీ పాత్రలు రాకపోవడం. కమెడియన్ గా కెరీర్ ని [more]

Update: 2019-08-27 09:16 GMT

కమెడియన్ సునీల్ ప్రస్తుతం కామెడీ పాత్రలు చేస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడు. కానీ ఆశ్చర్యం ఏటంటే ఆయనకు సరైన కామెడీ పాత్రలు రాకపోవడం. కమెడియన్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన సునీల్ ఆమధ్య హీరో అవకాశాలు రావడంతో అటుపై ద్రుష్టి మళ్ళించాడు. సునీల్ కి పూలరంగడు మూవీ తరువాత సోలో హీరోగా చేసిన చిత్రాలన్నీ పరాజయం పాలైనాయి. సునీల్ కమెడియన్ గా ఉన్న టైములో హీరోస్ కి సమానంగా అతని పాత్ర ఉండేది. కానీ ఇప్పుడు సునీల్ ఏ సినిమా చేస్తున్నాడు అనేది కూడా కనీస సమాచారం లేకపోవడం నిజంగా ఆశ్చర్యం.

కమెడియన్ గా ఫుల్ స్వింగ్ లో ఉన్న సునీల్ మాస్ హీరో అవ్వాలనే ఆలోచనతో తన కెరీర్ ని తానే చెడకొట్టుకున్నాడు. దాంతో సునీల్ కి ప్రాధాన్యం ఉన్న ఫుల్ టైం కమెడియన్ పాత్రలు కూడా రావడం లేదు. అసలు సునీల్ హీరో గా అవుదాం అనుకున్న టైములో కమెడియన్ ఆలీ ని ఫాలో అయ్యి ఉంటె బాగుండేది. ఆలీ సలహా తీసుకుని ఉంటే బాగుండేది. ఆలీ కూడా ఒక్కప్పుడు కమెడియన్ వేషాలు వేస్తున్న టైములో హీరోగా ఛాన్స్ వచ్చింది. యమలీల, ఘటోత్కచుడు వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఆలీ కేవలం కామెడీ హీరోగా ఎదగాలని చూసాడు కానీ ఎప్పుడూ మాస్ హీరో గా ఎదగాలని ప్రయత్నించలేదు. అందుకే ఆయనకు అంత డిమాండ్. అదే ఆయను సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో ఉండేలా చేసింది. సునీల్ కూడా ఇది ఫాలో అయ్యి ఉంటె బాగుండేది

Tags:    

Similar News