క‌మెడియ‌న్‌గా సునీల్ ప‌రిస్థితి ఏంటీ..?

Update: 2018-07-07 11:09 GMT

ఒకప్పుడు కమెడియన్ గా చాలా సినిమాలు చేసి సక్సెస్ ఆ తర్వాత హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సునీల్. స్టార్టింగ్ లో ఆయనను కొన్ని హిట్స్ పలకరించగా ఆ తర్వాత వరసబెట్టి ఫ్లాప్స్ ఎదురైయ్యాయి. ఇంకా తనకి హీరోగా కలిసి రాదనుకుని మళ్లీ కమెడియన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు.

క‌మెడియ‌న్‌గా రీఎంట్రీ

దాంతో ఆయనకు సినిమాలు మీద సినిమాలు వచ్చిపడుతున్నాయి. లేటెస్ట్ గా 'నేను శైలజ' ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల తరవాత తీయబోయే సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం సునీల్ ను తీసుకున్నాడు. ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. 'చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్' పేరుతో వస్తున్న ఈ సినిమాలో తేజు ఫ్రెండ్ గా సునీల్ కనిపించబోతున్నాడు.

వ‌రుస‌బెట్టి సినిమాలు...

అంతేకాకుండా శర్వానంద్ - సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'పడిపడి లేచే మనసు'లోనూ ఓ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. రవితేజ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో వస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోని' లో చాలా రోజుల తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించబోతున్నాడు. ఇలా వరసబెట్టి సినిమాలు మీద సినిమాలు చేస్తూ మంచి దూకుడుగానే కనిపించబోతున్నాడు సునీల్.

Similar News