సునీల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కమెడియన్..!

Update: 2018-12-19 06:42 GMT

హీరోగా చెల్లుబాటు కాక మళ్లీ కమెడియన్ గా మారిన సునీల్ ఓ అన్నంత ఊపులో అయితే దూసుకుపోవడం లేదు. సునీల్ నటించిన అరవింద సమేత హిట్ అయినా అందులో సునీల్ కి గొప్పగా పేరేమీ రాలేదు. ఇక అమర్ అక్బర్ ఆంటోనీ అయితే సోదిలోనే లేకుండా పోయింది. కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్లీ కమెడియన్ వేషాల కోసమే బరువు పెరిగిన సునీల్ బంతిలా తయారయ్యాడు. అయినా సునీల్ కమెడియన్ గా మరీ బిజీ అయితే కాలేదు. ఒకప్పుడు కమెడియన్ గా తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్న సునీల్ ప్రస్తుతం అంతగా ఫామ్ లో లేడు. అయితే తాజాగా మరో కమెడియన్ సునీల్ మీద సంచలన వ్యాఖ్యలు చేసాడు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కామెడియన్ గా పృద్వి ఇండస్ట్రీలో బాగా పాతుకుపోయాడు. మంచి మంచి కామెడీ కేరెక్టర్స్ చేస్తూ కాస్త బిజీగానే ఉన్న ఈ కమెడియన్ గారు తాజాగా ఒక రాజకీయ పార్టీలో కూడా చేరాడు.

గోళ్లు గిల్లుకుంటున్నాడు...

అయితే రీసెంట్ గా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ.. ‘‘తాను కెమెడియన్ గా బిజీగానే ఉన్నానని చెబుతూ.. ఒక్కోసారి ఒక్కొక్కరికి టైం వస్తుంది.. బ్రహ్మనందం కమెడియన్ గా చాలా రోజులు ఇండస్ట్రీలో ఉన్నారు. బ్రహ్మి తర్వాత సునీల్ వచ్చాడు. కమెడియన్ గా పీక్స్ లో ఉన్నప్పుడు హీరోగా మారి ఏడేళ్లు టైం వెస్ట్ చేసుకున్నాడు. హీరోగా చేసిన సునీల్ మళ్లీ కమెడియన్ గా మారాడు. అమ్మో సునీల్ మళ్లీ కమేడియన్ గా రీఎంట్రీ ఇస్తున్నాడు ఇక సునీల్ దే హావా.. అది చేస్తాడు, ఇది చేస్తాడు అని భయపడ్డారు. మరి మళ్లీ కమెడియన్ గా వచ్చిన సునీల్ ప్రేక్షకాదరణ పొందలేక గోళ్లు గిల్లుకుంటున్నాడు. అయినా హీరోగా చేసాక మళ్లీ కమెడియన్ అంటే.. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం నాకు లేదు’’ అంటూ సునీల్ పై పృథ్వి కాస్త సంచలనంగానే మాట్లాడాడు.

Similar News