కలర్స్ స్వాతి షాకిచ్చింది

Update: 2018-09-01 05:06 GMT

కలర్స్ ప్రోగ్రాం ద్వారా బాగా పాపులర్ అయిన స్వాతి సినిమా హీరోయిన్ గా డీసెంట్ పేరు తెచ్చుకుంది. గ్లామర్ షోకి దూరంగా వుండే స్వాతి స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. నిఖిల్ స్వామి రారా, కార్తికేయ, అలాగే నవీన్ చంద్ర తో కలిసి త్రిపుర సినిమాల్లో నటించిన స్వాతికి హీరోయిన్ గా మంచి పేరొచ్చింది. కానీ అవకాశాలు మాత్రం అడుగంటిపోయాయనే చెప్పాలి. ఇక తెలుగులో క్లిక్ అవ్వలేక కోలీవుడ్ లో అదృష్టం పరిక్షించుకున్న తెలుగమ్మాయి స్వాతి... ఈ మధ్యన సినిమాలకు బాగా గ్యాప్ తీసుకుంది.

అయితే ఈలోపు స్వాతి ప్రేమలో పడిందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే టాక్ నడిచింది. కానీ స్వాతి మాత్రం పెళ్లి విషయమై ఎక్కడా స్పందించలేదు. అయితే స్వాతి విషయం ప్రస్తుతం మరుగున పడిన టైం లో స్వాతి అందరికి షాకిచ్చింది. కలర్స్ స్వాతి పెళ్లి చేసుకుంది. అది కూడా మలేషియన్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా పని చేస్తున్న వికాస్ తో స్వాతి చాలా కాలంగా ప్రేమలో ఉండి.. పెద్దలను ఒప్పించి మరీ స్వాతి తన ప్రేమికుడిని పెళ్లాడింది. ఇక ఈ పెళ్లి ఇరు కుటుంబాల మధ్యన సాంప్రదాయ పద్దతిలో జరిగింది.

ఇక పెళ్లిని కొద్దీ మంది సన్నిహితుల మధ్యన చాలా సింపుల్ గా జరిగిందని.., స్వాతి పెళ్లి ఫొటోస్ చూస్తుంటే తెలుస్తుంది. ప్రస్తుతం స్వాతి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే పెళ్లి సింపుల్ గా కానిచ్చేసిన స్వాతి హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ లో స్వాతి తరుపున బందువులకు, సెలబ్రిటీస్ కి ఈ రిసెప్షన్ ఉంటుందని.. అలాగే మరో రిసెప్షన్ కూడా కొచ్చి లో పెళ్లి కొడుకు తరుపు బంధువుల కోసం ఉండబోతుందట

Similar News