ఎఫ్ 3 పై క్లారిటీ వచ్చేసిందా?

ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి కి మహేష్ బాబు తగిలాడు. మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసాడు. ఆ సినిమా [more]

Update: 2020-04-13 11:05 GMT

ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి కి మహేష్ బాబు తగిలాడు. మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసాడు. ఆ సినిమా హిట్ తర్వాత స్టార్ హీరోస్ ఎవరూ దొరక్క అనిల్ రావిపూడి దిల్ రాజు నిర్మాణంలో ఎఫ్ 3 ఎనౌన్స్ చేసాడు. ఎఫ్ 2 లో ఇద్దరు హీరోలు వెంకటేష్ – వరుణ్ తేజ్ లు నటిస్తే ఎఫ్ 3 లో ఆ ఇద్దరు హీరోలతో పాటుగా మరోహీరో నటిస్తాడని ప్రచారం జరగడం ఆ లిస్ట్ లోకి హీరో రవితేజ, మహేష్ పేర్లు వినబడడం జరిగింది. అయితే అటు రవితేజ కానీ ఇటు మహేష్ బాబు కానీ ఎఫ్ 3 చెయ్యడం లేదని క్లారిటీ రావడంతో..

అసలు మూడో కేరెక్టర్ ఉంటుందా అనేది అందరిలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. తాజాగా అనిల్ రావిపూడి ఎఫ్ 3 లో మూడో హీరో ఉండకపోవచ్చని అంటున్నాడు. తాజాగా అనిల్ రావిపూడి ఎఫ్ 3 గురించి మట్లాడుతూ.. మూడో హీరో ని అనుకున్న మాట నిజమే అని.. కానీ ప్రస్తుతానికి ఎవరిని ఎఫ్ 3 కోసం సంప్రదించలేదని.. ప్రస్తుతానికి మూడో హీరో ముచ్చట లేదని…. ఒకవేళ యాడ్ అయితే చివరిలో యాడ్ అవుతాడని స్పష్టత లేని సమాధానం చెప్పాడు. ఇక ఎఫ్ 2 లో నటించిన హీరో వేంకటేశ్, వరుణ్ తేజ్ లతో పాటుగా తమన్నా, మెహ్రీన్ లే కనబడతారని.. ఎఫ్ 2 కామెడిలా కాకుండా మరో కొత్త కథతో ఎఫ్ 3 ఉంటుంది అని చెప్పాడు.

Tags:    

Similar News