రామ్ అవుట్ డేటెడ్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా?

లవ్ స్టోరీస్ తో యావరేజ్ హిట్స్ కొట్టిన రామ్.. మాస్ మసాలా ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు… మాస్ ప్రేక్షకుల మనసులను [more]

Update: 2019-09-07 09:08 GMT

లవ్ స్టోరీస్ తో యావరేజ్ హిట్స్ కొట్టిన రామ్.. మాస్ మసాలా ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు… మాస్ ప్రేక్షకుల మనసులను దోచేశాడు. పూరి జగన్నాధ్.. రామ్ లోని మాస్ యాంగిల్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేసాడు. మాస్ లుక్ లో రామ్ యూత్ కి కనెక్ట్ అయ్యాడు. అందుకే ఈసారి కూడా మాస్ మాసాలతోనే రావాలని రామ్ డిసైడ్ అయ్యాడనే న్యూస్ నడుస్తుంది. అందుకే త్రినాథరావు నక్కినతో చెయ్యాల్సిన ప్రాజెక్ట్ ని, తమిళ రీమేక్ ని రామ్ హోల్డ్ లో పెట్టాడంటున్నారు.

షాక్ అవుతున్న రామ్ అభిమానులు

ఈలోపు రామ్ ఓ అవుట్ డేటెడ్ డైరెక్టర్ కి కమిట్ అయ్యాడంటున్నారు. ఇంటెలిజెంట్ లాంటి అవుట్ డేటెడ్ కథతో డిజాస్టర్ కొట్టిన వి. వి. వినాయక్ తో రామ్ ఓ మాస్ సినిమా చేయబోతున్నాడని, వినాయక్ హీరో గా చెయ్యాల్సిన సినిమా పట్టాలెక్కడానికి టైం పట్టేలా ఉండడంతో వినాయక్ ఓ మాస్ కథతో రామ్ ని కలవగా.. ఆ కథను నచ్చిన రామ్ సినిమా చేద్దామని చెప్పినట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే రామ్ అభిమానులు మాత్రం అవుట్ డేటెడ్ డైరెక్టర్ కి రామ్ సినిమా చేస్తానని చెప్పడం ఏమిటా అంటూ షాకవుతున్నారు.

 

Tags:    

Similar News