కంగనా కి కౌంటర్ ఇచ్చినా తాప్సి

నటి తాప్సీ తన సహనటి కంగనా రనౌత్‌కు కౌంటర్‌ ఇచ్చారు. రీసెంట్ గా తాప్సి నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రం గురించి కంగనా కనీసం మాట్లాడలేదని ఇందులో [more]

Update: 2019-08-16 09:48 GMT

నటి తాప్సీ తన సహనటి కంగనా రనౌత్‌కు కౌంటర్‌ ఇచ్చారు. రీసెంట్ గా తాప్సి నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రం గురించి కంగనా కనీసం మాట్లాడలేదని ఇందులో ఐదుగురు అమ్మాయలు నటించారని కానీ ఆమె ఎందుకు మెచ్చుకోలేదని ప్రశ్నించారు. ఓ మహిళ మరొక మహిళకు మద్దతు గా ఉండాలని ఆమె (కంగన) ఎప్పుడూ చెబుతుంటుంది.

తనకు ఇష్టమైన నటి అంటూనే….

అలాంటప్పుడు కంగనా తమ సినిమా గురించి ఎందుకు మాట్లాడలేదు అని ప్రశించారు. “సినిమాల విషయంలో ఆమె సీనియర్ నేను జూనియర్. అయినప్పటికీ ఇతరులు మెచ్చుకోదగ్గ చిత్రాల్లో నటించా. నాకు నటిగా కంగనా అంటే ఇష్టం. ఆమె నటనకు నేను పెద్ద ఫ్యాన్. రీసెంట్ గా ఆమె నాపై కామెంట్స్ చేసి షాక్ కి గురిచేసింది. నేను ఆ విషయంలో చాలా బాధ పడ్డాను.నన్ను ఓ సందర్భంలో కంగనా ని కాపీ కొడుతున్నాను అని అన్నారు. ఆ కామెంట్ నాకు సంతోషమే. ఎందుకంటె ఆమె నాకంటే గొప్ప నటి.. అందులోనూ అత్యధిక పారితోషికం తీసుకునే నటి కూడా అని కామెంట్ చేసింది తాప్సి. ఒక నటిగా నేను ఎప్పుడు ఆమెను ఇష్టపడతాను” అని చెప్పింది.

Tags:    

Similar News