Maa : ఆ బూతులు భరించలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న బెనర్జీ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో తనను మోహన్ బాబు బూతులు తిట్టారని నగుడు బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. పోలింగ్ కేంద్రంలోనే తనను మోహన్ బాబు ఇష్టమొచ్చినట్లు [more]

Update: 2021-10-12 12:47 GMT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో తనను మోహన్ బాబు బూతులు తిట్టారని నగుడు బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. పోలింగ్ కేంద్రంలోనే తనను మోహన్ బాబు ఇష్టమొచ్చినట్లు తిట్టారని, ఎవరూ ఆయనను ఆపే ప్రయత్నం చేయలేదని బెనర్జీ అన్నారు. చివరకు తనను కొట్టేందుకు కూడా మోహన్ బాబు వచ్చారని బెనర్జీ అన్నారు. కుటుంబ సభ్యులను కించపర్చేలా మాట్లాడారని బెనర్జీ విలపించారు.

నరేష్ కూడా…..

తాను బాధను దిగమింగుకుని మా ఎన్నికల పోలింగ్ లో పాల్గొన్నానని, మూడు రోజుల నుంచి ఆ బాధ తనను కలచి వేస్తుందని బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. నరేష్ కూడా తనను తూలనాడాడని, ముఠా నాయకుడని తనను నరేష్ దూషించాడని బెనర్జీ పేర్కొన్నారు. తాను రాజీనామా చేసిన తర్వాత బాధ కొంచెం తగ్గిందని బెనర్జీ బోరున విలపించారు.

Tags:    

Similar News