ఈ యాక్షన్ పార్ట్ సినిమాకే హైలెట్ అంట

Update: 2018-06-12 08:33 GMT

ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహ రెడ్డి షూటింగ్ ఒక రేంజ్ లో జరుగుతోంది. నిన్న మొన్నటివరకు నత్తనడకన సాగిన సైరా షూటింగ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పరిగెత్తిస్తున్నారు. చిరంజీవి సైరా నరసింహ రెడ్డి లుక్ లోనే తేజ్.. ఐ లవ్ యూ ఆడియో వేడుకకి హాజరయ్యాడు. సై రా కోసం మీసం, గెడ్డం పెంచిన చిరు ప్రస్తుతం సై రా లూక్ లోనే బయటికి వస్తున్నాడు. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సై రా నరసింహారెడ్డి షూటింగ్ ప్రస్తుతం ఒక కీలక షెడ్యూల్ ని చిత్రకరించుకోవడానికి సన్నద్ధం అవుతుంది. ఈ షెడ్యూల్ లో సై రా కి సంబందించిన యాక్షన్ పార్ట్ ని సురేందర్ రెడ్డి ప్లాన్ చేసాడు.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్ తో...

ఇప్పుడు తెరకెక్కించబోయేది సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే యాక్షన్ సీన్ అని చెబుతున్నారు. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్ ఒక హాలీవుడ్ స్టెంట్ మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కనుంది. స్కై ఫాల్, హ్యారీ పోటర్ వంటి సినిమాలకు స్టెంట్ మాస్టర్ గా పని చేసిన గ్రెగ్ పావెల్ సై రా యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నాడు. అయితే సై రా నరసింహారెడ్డి లో ఈ యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో వుండనున్నాయని.. ఈ సినిమా లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేసాడు. ఇక సై రా షూటింగ్ లో కీలక ఘట్టాన్ని ముగించిన తర్వాత ఆగష్టు లో అంటే చిరు పుట్టిన రోజున సై రా చిరు లుక్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా గా సమాచారం.

భారీ బడ్జెట్ తో బహు భాషల్లో...

అమితాబ్ బచ్చన్.. సై రా గురువు పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే ఆయన షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు. ఇక నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి వంటి పర భాష నటులు కూడా సై రా లో కీలక భాగస్వామ్యులు కాబోతున్నారు. పలు భాషల్లో తెరకెక్కనున్న సై రా చిత్రానికి ఇంకా ఆఫీషియల్ గా మ్యూజిక్ డైరెక్టర్ ని సెట్ చెయ్యలేదు చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ బహు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.

Similar News